“మాకు పరిమితులు ఉండొచ్చేమో కానీ… మా ఆశయాలకు లేవు. అందుకే ఇంత పెద్ద సినిమాని మేం చేయగలిగాం. ఈ సినిమాతో ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాం. యాక్షన్, అడ్వంచర్ తో పాటు ఆశ్చర్యపోయే ఎన్నో విషయాలు ఉంటాయి. పిల్లలు మొదలుకొని అందరికీ నచ్చే సినిమా. మంచి సినిమా చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో మేమంతా పనిచేశాం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక నటుడు కావడమే పెద్ద విషయం. అలాంటిది చాలా దూరం వచ్చాను. ఆ విషయంలో ఆనందంగా ఉంది. ఇంకా ఎంతో దూరం వెళ్లాలి. అభిరుచి, తపన ఉన్న నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ ఈ సినిమా వెనకాల ఉండటంతోనే చేయగలిగాం. కార్తీక్ నాకు ఈ కథ చెప్పినప్పుడు, దీనివెనక ఇబ్బందులే చెప్పారు.
ఇప్పటివరకూ ఎవ్వరూ చేయలేదు, మనం చేయాల్సి వస్తుందన్నారు. ఇదే కదా మనం చేయాల్సింది, ఇదే కదా మన ప్రేక్షకులకు ఇవ్వాల్సిందని రంగంలోకి దిగాం. ఆ తర్వాత మనోజ్ అన్న వచ్చారు. భవిష్యత్తులో రాబోతున్న సినిమాలతో మనం అంతర్జాతీయ స్థాయికి చేరబోతున్నాం. కుటుంబ కథతో, కుటుంబం కోసం చేసిన ఈ సినిమాని అందరూ తక్కువ ధరలకే చూసేలా ఏర్పాట్లు చేశాం’’.