ఏక కాలంలో నాలుగు పీఎస్ ల ఇన్ స్పెక్షన్కొత్త ఎస్పీ పని తీరుతో జిల్లా సిబ్బంది హడల్…….
విజయనగరం జిల్లా విజయనగరం ,చీపురుపల్లి పోలీస సబ్ డివిజన్ పరిధిలలో గల నాలుగు పోలీస్ స్టేషన్ లను ఎస్పీ దామోదర్ అకస్మాత్ గా ఇన్ స్పెక్ట్ః చేసారు. గుర్ల, గరివిడి, చీపురుపల్లి, చీపురుపల్లి సర్కిల్ కార్యాలయం, నెల్లిమర్ల పోలీసు స్టేషన్లును జిల్లాఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం సందర్శించారు. స్టేషను ప్రాంగణాలను,పోలీసు స్టేషనుల్లో ఏర్పాటు చేసిన అవగాహన బోర్డులను పరిశీలించారు. పని చేసే పోలీసు సిబ్బందితో మమేకమై, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, వారికి అవసరమైన మౌళిక వసతులను కల్పించాలని అధికారులనుజిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ.. పోలీసు స్టేషనుకు వచ్చే బాధితులు, ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ప్రజలతో సత్సంబంధాలు ఉండాలని, తద్వారా పోలీసుశాఖ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. పోలీసు స్టేషను ప్రాంగణాలను ఆహ్లాదకరంగా, పరిశుభ్రంగా ఉంచాలన్నారు.పోలీసు స్టేషనులో ప్రధానంగా నమోదవుతున్న కేసులను గురించి, శాంతిభద్రతల సమస్యల గురించిసంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలుచేపట్టాలన్నారు.మహిళలు, బాలల భద్రతకు ప్రాధాన్యత కల్పించాలని, మహిళల రక్షణ కోసం ప్రత్యేకగా రూపొందించిన శక్తిమొబైల్ యాప్ గురించి, ఆపద సమయంలో శక్తి ఎస్.ఓ.ఎస్.ను వినియోగించి, రక్షణ ఏవిధంగా పొందవచ్చునో మహిళలకు అవగాహన కల్పించాలన్నారు.
పాఠశాల విద్యార్థులకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ వంటి సున్నిత అంశాలు పట్ల అవగాహన కల్పించాలని, ఇందుకు మహిళా సంరక్షణ పోలీసులు, శక్తి బృందాల సేవలను వినియోగించు కోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
గంజాయి అక్రమ రవాణ నియంత్రణ చర్యలు చేపట్టాలని, గంజాయిని వినియోగించే వ్యక్తులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి, వారిని కట్టడి చేయాలన్నారు. గంజాయి వినియోగించే వారికి గంజాయి ఎక్కడ నుండి సరఫరా అవుతున్నది గుర్తించి, వారిపై కేసులను నమోదు చేయాలన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువతను సన్మార్గంలో నడిపేందుకు కౌన్సిలింగు చేయాలన్నారు.
సైబరు నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వివిధ సైబరు నేరాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, ప్రజలకు సైబరు మోసాల తీరును వివరించి, సైబరు నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకోకుండా అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
రహదారి భద్రత పట్ల వాహనదారులకు అవగాహన కల్పించాలని, రహదారి ప్రమాదాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రహదారి ప్రమాదాలు తరుచూ జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నియంత్రణకు అవసరమైన హెచ్చరిక బోర్డులను, స్టాపర్లు, లైటింగు, స్పీడు బ్రేకర్లును ఏర్పాటు చేయాలన్నారు.
పోలీసు స్టేషన్లులో దర్యాప్తులో ఉన్న వివిధ కేనులను, రికార్డులను జిల్లా ఎస్పీ పరిశీలించి, ఆయా కేసుల్లో దర్యాప్తును పూర్తి చేయాలని, అధికారులకు దిశా నిర్ధేశం చేసారు.ఈ కార్యక్రమంలో చీపురుపల్లి డిఎస్పీ ఎస్. రాఘవులు, చీపురుపల్లి సిఐ శంకర్రావు, భోగాపురం రూరల్ సిఐ జి.రామకృష్ణ, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, ఎస్ఐలు ఎల్.దామోదర్, లోకేశ్వరరావు, గణేష్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.