Native Async

Sankrantiకి త్రిముఖపోరు… విజయం ఎవరిదో

Sankranti release movies list
Spread the love

తెలుగువారి పెద్ద పండుగకు పెద్ద సినిమాలే రాబోతున్నాయి. రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌, బాలకృష్ణ డాకూ మహారాజ్‌, వెంకటేష్‌ Sankrantiకి వచ్చేయండి సినిమాలు విడుదల కాబోతున్నాయి. మూడు పెద్ద సినిమాలే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ ముగ్గురిలో విజయం ఎవరన్నది Sankranti Festival తరువాత పక్కాగా తేలిపోతుంది.

Sankranti Festival బరిలో ఆ ముగ్గురు

Sankranti అంటే పండుగతో పాటు సినిమాలు కూడా ముఖ్యమే. పండుగ సమయంలో ఊరెళ్లినవారు తమ కుటుంబాలతో కలిసి సినిమాలకు వెళ్తుంటారు. ఒకప్పుడు ఇదొక సరదా. కానీ, ఇప్పుడు అదే సరదా వెళ్లాలి అనే రూల్‌ వరకు వెళ్లింది. పండుగ రోజున అన్ని పనులు ముగించుకొని ఎంచక్కా అందరూ కలిసి Sankranti సినిమాలకు వెళ్తారు. బహుశా అందుకే సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్‌ చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. ఈ ఏడాది అంటే 2025 Sankrantiకి టాలీవుడ్‌లో ముగ్గురు టాప్‌ హీరోల సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి. భారీ చిత్రాల దర్శకుడు అంటే మనందరికీ గుర్తుకు వచ్చేది శంకర్‌. తన మొదటి సినిమా ప్రేమికుడు నుంచి రోబో వరకు దాదాపుగా అన్ని హిట్‌ సినిమాలే. ఆయనతో సినిమా అంటే భారీతనం ఖచ్చితంగా ఉంటుంది. పాటల చిత్రీకరణలో శంకర్‌ రూటే సపరేటు. ఇప్పటి వరకు తమిళంలో సినిమాలు తీసి తెలుగులో డబ్‌ చేసేవారు. కానీ, మొదటిసారిగా శంకర్‌ తెలుగులో స్టైట్‌ మూవీ చేస్తున్నాడు. అదీ కూడా త్రిపుల్‌ ఆర్‌ సినిమాతో బంపర్‌ హిట్‌ కొట్టిన రామ్‌చరణ్‌తో.

రామ్‌ చరణ్‌ గేమ్‌ చేంజ్‌ చేస్తాడా?

ఇప్పటికే రిలీజైన Game Changer మూవీ ట్రైలర్‌ వావ్‌ అనిపించే విధంగా ఉంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా మినిమం 500 కోట్లు పైగా కలెక్ట్‌ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంకొందరైతే ఆర్ఆర్ఆర్ మాదిరిగానే ఈ సినిమా కూడా వెయ్యికోట్ల క్లబ్‌లో చేరుతుందని కూడా అంటున్నారు. ఈ సినిమా ఏ రేంజ్‌లో హిట్‌ అవుతుందో చూడాలి. దిల్‌ రాజు చేస్తున్న సాహసానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారా లేదా అన్నది జనవరి 10వ తేదీతో తేలిపోతుంది. Sankranti గేమ్‌ని చరణ్‌, శంకర్‌లు ఏ మేరకు ఛేంజ్‌ చేస్తారో చూడాలి. ట్రైలర్‌ ప్రకారం సినిమా పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో ఉన్నదని అర్థం అవుతున్నది. శంకర్‌ తొలిసారి తన సొంత కథను కాకుండా మరో దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ కథతో సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం.

బాలయ్య వందకోట్లు కొల్లగొడతాడా?

Sankranti బరిలో నిలిచిన మరో సినిమా డాకూ మహారాజ్‌. బాలయ్యబాబు పవర్‌ఫుల్‌ యాక్షన్‌తో బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ఫుల్‌ పవర్‌ప్యాక్‌ అనే చెప్పాలి. అడవిలో శతృవులను వేటాడే సన్నివేశాలతో రూపొందించిన ట్రైలర్‌ ఇందుకు నిదర్శనం. మాస్‌ డైలాగ్స్‌ ఇప్పటికే అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాయి. యాక్షన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవన్నీ ఒకెత్తైతే బాలయ్య ఎప్పుడూ లేని విధంగా సాంగ్స్‌లోనూ తనదైన మెరుపులు మెరిపించాడు. కాంట్రవర్షియల్‌ స్టెప్స్‌తో వావ్‌ అనిపించాడు. యాభై పదుల వయసులోనూ తన స్టైల్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నది. యువహీరోలంతా వందకోట్లు దాటి వెయ్యికోట్ల క్లబ్‌లో చేరుతున్న నేపథ్యంలో వారికి ఏమాత్రం తగ్గబోనని బాలయ్యబాబు అంటున్నాడు. తగ్గేదేలే అంటున్న బాలయ్య వందకోట్లను కొల్లగొడతాడా లేదా అన్నది మరికొన్ని రోజుల్లోనే తేలిపోతుంది.

సంక్రాంతి విక్టరీ కేరాఫ్‌ వెంకీ

ఒకప్పుడు Sankranti అంటే విక్టరీ వెంకటేష్‌ గుర్తుకు వస్తాడు. ప్రతీ సంక్రాంతికి ఆయన సినిమా తప్పనిసరి. కొత్తల్లుడిలా వచ్చి ప్రేక్షకులను మెప్పించి హిట్‌ను తన ఖాతాలో వేసుకొని వెళ్తాడు. కాలం మారుతున్న తరుణంలో యువ హీరోల నుంచి పోటీ పెరిగిపోయింది. ఆ పోటీని తట్టుకొని, తన ఫ్యామిలీ ఆడియన్స్‌ను దూరం చేసుకోకుండా వారికి నచ్చేలా వారు మెచ్చేలా… కనకవర్షం కురిసేలా సంక్రాంతికి విజయం సాధించేలా ప్లాన్‌ చేసుకొని వస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వచ్చేస్తున్నాం పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ ఇప్పటికే ఆకట్టుకుంది. చాలా కాలం తరువాత రమణ గోగుల ఈ సినిమాలో సాంగ్‌ పాడటం, ఆ పాట సినిమాకే హైలైట్‌ కావడంతో ప్రేక్షకులు కూడా సంక్రాంతికి వచ్చేయండి అని పిలుస్తున్నారు. మరి ఈ పిలుపులో ఎంతవరకు నిజముందన్నది రిలీజైన తరువాతగాని తెలియదు. సంక్రాంతి పోరులో విజయం ఒక్కరిదే అవుతుందా లేదంటే ముగ్గురూ విజయం సాధిస్తారా అన్నది మరికొన్ని రోజుల్లోనే తేలిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *