మాటా…బాష అందుబాటులోకి వచ్చిన తరువాత మనిషిని పిలిచేందుకు ప్రత్యేకించి పేర్లు పెట్టుకున్నారు. ఆయా పేర్లతోనే పిల్లలను పిలుస్తున్నారు. ఎన్నో శతాబ్దాలుగా ఈ పేర్ల సంస్కృతి అందుబాటులో ఉంది. సంప్రదాయంతో పాటు మోడ్రన్‌గా పేర్లను పెట్టుకొని పిలుచుకుంటున్నారు. పేర్లు లేకుంటే ఎవర్ని ఎలా పిలవాలో తెలిసేది కాదు. కానీ, పేర్లు లేకుండానే పిలుచుకోవచ్చని అంటున్నారు కొంతమంది ప్రజలు. మరి వారెవరు…ఎక్కడున్నారు…ఎలా పిలుచుకుంటారో ఈ కథనంలో తెలుసుకుందాం.
ముద్దుపేరైనా…అసలు పేరైనా పాటల రూపంలోనే

మనిషికి ఐడెంటిటీ పేరే. ప్రభుత్వం అందించే అన్ని రకాలైన పత్రాల్లో పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. పేరు లేకుంటే ఆధార్ నుంచి స్కూల్ సర్టిఫికెట్ వరకు ఏదీ కూడా ఇచ్చేందుకు అనుమతించరు. పేరు లేకుంటే ఏం ముద్దుపేరైనా ఉంటుంది కదా అనుకోవచ్చు. కానీ, అక్కడ అసలు పేర్లైనా…ముద్దుపేర్లైనా సరే అన్నీకూడా రాగాల రూపంలో ఉంటాయి. రాగం అంటే Keeravani Ragam, Hindustani Ragam, Hindola Ragam ఇలా పేర్లతో కాదు…స్వచ్చంగా రాగాలే ఉంటాయి. ఆ రాగం కూడా శ్రావ్యంగా పాట రూపంలో ఉంటుంది. ఆ రాగం ఆ పాటే అక్కడి మనుషుల ఐడెంటిటీ. ఆ గ్రామంలోని ప్రజలు తప్పించి మరొకరు అక్కడి వాళ్లను పిలవలేరన్నది వాస్తవం. ఇంతకీ ఆ village ఎక్కడ ఉంది. ఆ పాటలు ఎలా ఉంటాయి. ఎవరు ఆ రాగాలను సమకూరుస్తారు.
Whistle Village కథ
వినేందుకు కొత్తగా అనిపిస్తున్న ఈ గ్రామం కథ చాలా పురాతనమైదే. తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని, తమను ప్రత్యేకంగా గుర్తించాలని భావించిన అక్కడి ప్రజలు తమకోసం అందరిలా సామాన్యమైన పేర్లు కాకుండా రాగయుక్తమైన పేర్లను పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామస్తులు పేర్లతో కాకుండా రాగయుక్తంగా పాడుతూ తమ వారిని పిలుస్తుంటారు. ఇది వాస్తవం. విచిత్రం ఏమంటే గ్రామంలోని ఒక పిల్లవానికి ఒక రాగం ఉంటే మరొక పిల్లవానికి అదే విధమైన రాగం ఉండదు. ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉంది అన్నదే కదా మీ సందేహం. ఈ గ్రామం పేరు Kongthong. Meghalaya రాజధాని Shillong నుంచి 60 కిమీ దూరంలో ఉన్న తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఉంది. కొంగ్‌థాంగ్ గ్రామాన్నే విజిల్ విలేజ్ అని పిలుస్తారు. ఆ గ్రామంలోని గ్రామస్తులు ప్రత్యేక Tuneని కంపోజ్ చేస్తారు. ఈ ట్యూన్‌ని జింగార్‌వై లవ్బీ అని పిలుస్తారు. దీని అర్ధం తల్లిప్రేమ గీతం అని. గ్రామంలోని ప్రజలకు తప్పనిసరిగా రెండు పేర్లుంటాయి. ఒకటి సాధారణ పేరుకాగా రెండో పేరు పాటగా ఉంటుంది. పాటల పేర్లకు రెండు వెర్షన్లు ఉంటాయి. ఒకటి పొడవైన పాటకాగా రెండోది చిన్నపాట. మనం ముద్దుపేరు పిలుచుకున్నట్టుగానే చిన్న పాటలను ఇంట్లోను, పొడవైన పాటలను బయట వ్యక్తులు ఉపయోగిస్తారు.
గ్రామంలో 700 రాగాలు
తాజా లెక్కల ప్రకారం కొంగ్‌థాంగ్ లేదా Whistle Village గ్రామంలో సుమారు 700 మంది వరకు ప్రజలు నివశిస్తున్నారు. పుట్టిన పిల్లవాడికోసం తల్లులు ప్రత్యేకించి ట్యూన్‌ను తయారు చేస్తారు. అప్పటి వరకు ఎవరూ ఎవరూ ఉపయోగించని రాగాన్ని తల్లులు తయారు చేస్తారు. బిడ్డ పుట్టిన తరువాత ఆ ట్యూన్‌తోనే పిలవడం ప్రారంభిస్తారు. ఒకవేళ కొంగ్‌థాంగ్ గ్రామంలో ఎవరైన మరణిస్తే అతని పేరుతో ఉన్న ట్యూన్ కూడా అక్కడితో ఆగిపోతుంది. అటువంటి ట్యూన్‌ను మరొకలు ఉపయోగించరు. ఇంట్లో పిల్లల్ని పిలవాలి అంటే చిన్న రాగంతో పిలుస్తారు. ఇలాంటి చిన్న రాగాలను తల్లులే తయారు చేస్తారు. అదేవిధంగా పెద్ద రాగాలను కూడా తల్లులే తయారు చేయడం ఆనవాయితీ. కొంగ్‌థాంగ్ లేదా Whistle Village గ్రామంలో ఈ ఆనవాయితీ తరతరాలుగా వస్తున్నది. రాగాలతో పేర్లు ఎప్పుడు ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. పేరుతో కాకుండా రాగంతో పిలవడం తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. రాగాలే తమకు గుర్తింపు తెచ్చిపెట్టాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.