జగన్ ప్రభుత్వ హాయాంలో పేదొడిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలన్న లక్ష్యంతో మా పార్టీ అధినేత ఏర్పాటు స్థాపించిన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ నవంబర్ 11వ తేదీన జిల్లా వ్యాప్తంగా నియోజక వర్గ స్థాయిలో నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్పీపీ భీమిలి నియోజక వర్గ నేత మజ్జి శ్రీనివాస అన్నారు. సిరిసహస్ర రైజింగ్ ప్యాలస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనీ విషయాన్ని తెలిపారు.
పేదొడిని ప్రభుత్వమే వైద్యుడి చేయాలన్న తండ్రి వైఎస్ఆర్ సంకల్పాన్ని తనయుడు జగన్ పాదయాత్ర తో అధికారం చేపట్టి నవరత్నాలలో భాగంగా విజయనగరం లో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రైవేటీకరణ చేపట్టడం దారుణమైన చర్యగా వైఎస్ఆర్పీపీ అభివర్ణిస్తోందన్నారు. వాస్తవానికి నవంబర్ 4వ తేదీన పార్టీ పరంగా నిరసన ర్యాలీ నిర్వహించాలని తలపెట్టినా… వర్షాలు కారణం గా పదకొండో తేది నాడు నిరసన, ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చిన్న శీను స్పష్టం చేశారు.