ఉప్పలపాటి ప్రభాస్… అప్పుడు కొత్తగా ఈశ్వర్ సినిమా చూసినప్పుడు మనం నార్మల్ గా కొత్త హీరో వచ్చాడే అనుకున్నాం కదా! లెజెండరీ నటుడు కృష్ణం రాజు వారసత్వం కూడా పెద్ద తెర మీద ఉండాలి అని కొత్త హీరో వచ్చాడు అన్నారు. కానీ మన డార్లింగ్ మెల్ల మెల్లగా ఎక్కేసాడు భయ్యా… ఎప్పుడు ప్రభాస్ నుంచి డార్లింగ్ అయ్యాడో తెలియలేదు… అప్పుడే అతను సినిమాల్లోకి వచ్చి 23 ఏళ్ళు అయ్యాయా అనిపిస్తుంది కదూ.
రాఘవేంద్ర సినిమా OK అనిపించినా, వర్షం తో గుండెలు కొల్లగొట్టాడు. చక్రం తో సెంటిమెంట్ జోన్ ని కొట్టి, ఛత్రపతి తో యాక్షన్ జోన్ లోకి వచ్చేసాడు. పౌర్ణమి, యోగి, బిల్లా, బుజ్జిగాడు ఇలా అన్ని మంచి హిట్స్ అయ్యాయి. ఇక డార్లింగ్, MR పర్ఫెక్ట్, మిర్చి తో బాగా నచ్చేసాడు.
ఇక ఆతరువాత బాహుబలి… ఇంకేమైనా చెప్పాలా… ఆ తరవాత స్టోరీ మనకి తెలిసిందే కదా… సాహూ, ఆదిపురుష్, రాధే శ్యామ్ ప్లాప్ ఐన కానీ, ఫేమ్ తగ్గలేదు. సాలార్ తో హిట్ కొట్టి, కల్కి తో చంపేశాడు. ఇక ఇప్పుడు రాజా సాబ్ టైం! ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా 9th జనవరి న రిలీజ్ అవుతుంది…
అందుకే ప్రభాస్ 23 ఇయర్స్ ఇండస్ట్రీ లో పూర్తైన సందర్బంగా స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు… దాంట్లో వింటేజ్ లుక్ తో అదరగొట్టాడు.