ఈరోజు అనగా జులై 18 శుక్రవారం రోజున రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ వివరంగా వివరించడం జరిగింది. గ్రహాల స్థితిని అనుసరించి, వాటి ప్రభావం రాశులపై ఏ విధంగా ఉన్నదో, ఆర్థిక, ఉద్యోగ, ఆరోగ్య, వివాహం, వ్యక్తిగత జీవితంలో జరిగే మార్పులు, చేర్పులు ఏమిటో సవివరంగా వివరించడం జరిగింది.
మేషం (Aries) – అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆసక్తికరమైన అంశం: ఆర్థిక లాభాలతో పాటు వ్యాపారంలో పురోగతి
ఈరోజు ఈరాశివారికి ఆర్థికంగా బాగుంటుంది. శుక్రుడు పంచమ స్థానంలో ఉండటంతో పాటు ధనస్థానంలో ఉండటం వలన ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు అందుకుంటారు. నూతన ప్రాజెక్టులను చేపడతారు. మీ జీవితంలో అనుకున్న విధంగా ముందుకు సాగుతారు. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది. మానసికంగా ఏమైన కొంత ఒత్తిడి ఉంటే యోగ లేదా ధ్యానం ద్వారా తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చిస్తారు. భాగస్వామితో మీ సంబంధాలు మరింత బలపడతాయి. ఇక ఈరోజు మీరు ఇష్ట దేవతకు సంబంధించిన స్తోత్రం పఠించడం లేదా గణపతిని ఆరాధించడం వలన మరిన్ని శుభకరమైన ఫలితాలను పొందుతారు. ఈరోజు ఎరుపు మీ లక్కీకలర్ కాగా లక్కీనంబర్ 9.
వృషభం (Taurus) – కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆసక్తికరమైన అంశం: ఆరోగ్యం, వృత్తిపరమైన హోదా
ఈరోజు ఈరాశివారు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఆదాయం కూడా అనుకున్న విధంగా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగానే ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. మీరు చేసిన పనుల పట్ల పై అధికారులు సంతృప్తికరంగా ఉంటారు. ప్రశంసలు పొందుతారు. రాజ్యాధిపతి శుక్రుడు ధనస్థానంలో ఉండటం మీకు కలిసి వస్తుంది. ఆర్థికపరంగా మీకు సంతృప్తిగా ఉంటుంది. అంతేకాదు, నూతన ఒప్పందాలు వ్యాపారంలో కలిసి వస్తాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. అయితే, పదేపదే మీ ఆరోగ్యం గురించి ఆలోచనలు చేయకూడదు. వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అవి ఈరోజు ఫలించే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీరు గోశాలకు వెళ్లి గోవులకు గ్రాసాన్ని సమర్పించాలి. లేదా పేదలకు అన్నదానం చేయాలి. మీ లక్కీ కలర్ తెలుపు కాగా లక్కీనంబర్ 6.
మిథునం (Gemini) – మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
ఆసక్తికరమైన అంశం: ఆర్థికంగా బాగుంటుంది, సుఖవంతమైన జీవనం
ఈరోజు ఈరాశివారికి ఆర్థికంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ధనస్థానంలో గురువు ఉండటం వలన పలు విధాలుగా ఆదాయం లభిస్తుంది. ఈరోజు మొత్తం హాయిగా సుఖవంతంగా గడుస్తుంది. మీరు చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఉంటాయి. మీరు చేస్తున్న వ్యాపారంలో డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆదాయం కోసం ఎక్కువ వెంపర్లాడకుండా కొంత సమయం విశ్రాంతికి కేటాయించాలి. ఇక కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు మీరు మీ గురువుకు సంబంధించిన స్తోత్రం పఠనం చేయాలి. లేదా శ్రీమహావిష్ణువును ఆరాధించాలి. ఈరోజు మీ లక్కీ కలర్ పసుపు. లక్కీనంబర్ 3.
కర్కాటకం (Cancer) – పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆసక్తికరమైన అంశం: వ్యక్తిగత సమస్యల నుంచి బటయపడతారు.
ఈరోజు ఈరాశివారిని ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్యలు పరిష్కారమౌతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఆదాయంలో స్థిరత్వాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి మెప్పు పొందుతారు. ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక నూతన ప్రాజెక్టులు చేపడతారు. ఒప్పందాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి చింతించవలసిన అవసరం లేదు. అయితే, మితాహారం తీసుకోవడం మంచిది. కుటుంబంలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు మీరు మహాశివుని స్తోత్రం లేదా శివారాధన చేయడం మంచిది. ఈరోజు మీ లక్కీకలర్ వెండి రంగు. లక్కీనంబర్ 2.
సింహం (Leo) – మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆసక్తికరమైన అంశం: కెరీర్‌లో కీలక నిర్ణయాలు
ఈరోజు ఈరాశివారు తమ భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలు మీ జీవితాన్ని నిర్ధేశిస్తాయి. ఇక ఆర్థికంగా బాగుంటుంది. స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారంలో అనుకోని విధంగా లాభాలను గడిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూలమైన సమయం. నిర్ణయాలు తీసుకోవడంలో విరామం లేకుండా ఉంటారు కాబట్టి కొంత సమయాన్ని విశ్రాంతి తీసుకోవడానికి తప్పకుండా కేటాయించాలి. మీరు ఎవరి ప్రేమలోనైనా ఉంటే ఆ సంబంధాలు బలపడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజున మీరు సూర్యుడిని ఆరాధించాలి వీలైతే ఆదిత్య హృదయాన్ని పఠించడం మేలు. ఈరోజు మీ లక్కీ కలర్ బంగారం రంగు. లక్కీనంబర్ 1.
కన్య (Virgo) – ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
ఆసక్తికరమైన అంశం: మానసిక స్పష్టత, ధైర్యం
ఈరోజు ఈరాశివారు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ధైర్యంగా వ్యవహరిస్తారు. కీలకమైన నిర్ణయాలను నిజాయితీతో తీసుకుంటారు. ఈ నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే, ఆర్థికంగా కొంత ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది. పనిచేస్తున్న ప్రదేశంలో శ్రమ అదనంగా చేయవలసి వస్తుంది. మీరు చేసిన శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ఒత్తడి పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు యోగ లేదా ధ్యానం వంటివి చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించాలి. ఈరోజు ఈరాశివారు గణపతికి సంబంధించి స్తోత్రాలను పఠించాలి. గణపతి ఆరాధన శుభఫలితాలు ఇస్తుంది. ఈరోజు ఈరాశివారికి లక్కీకలర్ ఆకుపచ్చ కాగా లక్కీనంబర్ 5.
తుల (Libra) – చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఆసక్తికరమైన అంశం: ఆస్తి వివాదాల నుండి విముక్తి
ఈరోజు ఈరాశివారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. వివాదాల నుంచి విజయవంతంగా బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న విధంగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో మీకు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారంలో నూతన అవకాశాలు వస్తాయి. స్వల్పకాలిక పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే, తీసుకునే ఆహారం పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. మానసికంగా సంతోషాన్ని ఇస్తుంది. ఈరాశివారు శుక్రుని ఆరాధన లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించాలి. ఈరోజు ఈరాశివారికి కలిసి వచ్చే రంగు నీలం కాగా లక్కీనంబర్ 7.
వృశ్చికం (Scorpio) – విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఆసక్తికరమైన అంశం: వ్యాపారంలో డిమాండ్ పెరుగుదల
ఈరోజు ఈరాశివారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి డిమాండ్ పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. నూతన ఒప్పందాలు విజయవంతమౌతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. పెట్టబడులకు అనుకూలమైన సమయం. లాభాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉన్నా శ్రమ పెరుగుతుంది. కాబట్టి కొంత విశ్రాంతి తీసుకోవాలి. కుటుంబంలో మీకు సంబంధించి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈరోజు ఈరాశివారు హనుమంతుడిని ఆరాధించాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ఉత్తమం. ఈరోజు ఈరాశివారికి కలిసి వచ్చే రంగు ఎరుపు కాగా లక్కీనంబర్ 8.
ధనస్సు (Sagittarius) – మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆసక్తికరమైన అంశం: ఆర్థిక స్థిరత్వం
ఈ రోజు ఈరాశివారికి ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించవచ్చు, వ్యాపారంలో లాభాలు అందుకోవచ్చు. కొత్త ప్రాజెక్టులు లేదా ఒప్పందాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది, కానీ విశ్రాంతి తీసుకోండి. కుటుంబంతో సరదాగా గడుపుతారు. గురు స్తోత్రం చదవడం లేదా విష్ణు ఆరాధన మంచిది. ఈరోజు ఈరాశివారికి లక్కీ కలర్ పపుపుకాగా లక్కీ నంబర్ 9.
మకరం (Capricorn) – ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
ఆసక్తికరమైన అంశం: కెరీర్‌లో పురోగతి
ఈ రోజు ఈరాశివారికి కెరీర్‌లో పురోగతి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావాకాశాలు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది, కానీ ఒత్తిడిని నివారించండి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఈరోజు ఈరాశివారు శని ఆరాధన లేదా శని స్తోత్రం చదవడం మంచిది. ఈరోజు ఈరాశివారికి కలిసివచ్చే రంగు నీలం కాగా కలిసి వచ్చే నంబర్ 8.
కుంభం (Aquarius) – ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆసక్తికరమైన అంశం: ఊహించని ఆఫర్లు
ఈరోజు ఈరాశివారి జీవితం ఊహించని విధంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని విధంగా అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా ఆదాయం బాగుంటుంది. కెరీర్‌లో అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఇక వ్యాపారం విషయానికి వస్తే నూతన ప్రాజెక్టులను చేపడతారు. ఒప్పందాలు విజయవంతమౌతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విశ్రాంతి తీసుకోవాలి. ప్రేమికులకు అనుకూలమైన కాలం. సంబంధాలను మరింత బలపరుచుకుంటారు. ఈరోజు ఈరాశివారు శని ఆరాధన చేయాలి. శని స్తోత్రం పఠించడం అన్నివిధాలుగా బాగుంటుంది. ఈరోజు ఈరాశివారికి కలిసి వచ్చే రంగు నీలం కాగా కలిసివచ్చే సంఖ్య 4.
మీనం (Pisces) – పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆసక్తికరమైన అంశం: కుటుంబ ఆనందం
ఈరోజు ఈరాశివారికి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. ప్రమోషన్లు రావొచ్చు. వ్యాపారంలో నూతన అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది. అయితే, ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి విందువినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈరాశివారు గురుకు సంబంధించిన స్తోత్రాలను పఠించాలి. శ్రీమహావిష్ణువు ఆరాధన శుభప్రదం. ఈరోజు ఈరాశివారికి కలిసివచ్చే రంగు పసుపు. లక్కీనంబర్ 3.