డాలర్‌తో రూపాయి మారక విలువ పెరుగుతుండటం అంతర్జాతీయంగా కొంత ఇబ్బందికరమైన అంశమే అయినప్పటికీ, అమెరికాతో వాణిజ్య సంబంధాలు సన్నగిల్లుతున్న నేపథ్యం, రూపాయితోనే అంతర్జాతీయ దేశాలతో భారత్ ట్రేడింగ్ చేయడంతో పాటు, యూపీఐ ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్న సమయంలో ఆర్బీఐ ఈ ఏడాది జులై నెలలో అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రతి నెలా ప్రతి దేశం విదేశీ మారకద్రవ్యాన్ని పెంచుకోవడానికి డాలర్లను కొనుగోలు చేస్తుంటాయి. ఏ దేశం వద్ద ఎంత మొత్తంలో డాలర్ నిల్వలు ఉన్నాయన్నదాన్ని బట్టి ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఉంటుంది.
అయితే, డాలర్ మారకాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్న భారత్ జులై నెలలో ఒక్క యూఎస్ డాలర్‌ను కూడా కొనుగోలు చేయలేదు. పైగా, ఆ నెలలో ఆర్బీఐ తన వద్దనున్న నిల్వల నుంచి 2.54 బిలియన్ డాలర్లను అమ్మేసింది. రూపాయిని స్థిరపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బ్రిక్స్ దేశాల మధ్య ప్రీట్రేడింగ్ జరుగుతున్నది. బ్రిక్ సభ్య దేశాలు నేరుగా వారి వారి డబ్బును ఉపయోగించి వాణిజ్యం నిర్వహిస్తున్నాయి. బ్రిక్‌లో సభ్యదేశాలు పెరుగుతున్న నేపథ్యంలో డాలర్‌తో సంబంధం లేకుండా వ్యాపారాన్ని నిర్వహించేందుకు భారత్ సన్నద్దమౌతున్నది.