ఇల్లు కట్టిచూడు పెళ్లిచేసి చూడు అన్నారు పెద్దలు. ఈరోజుల్లో పెళ్లిళ్లు చాలా ఈజీగా జరిగిపోతున్నాయి. కారణం గ్లోబలైజేషన్ ఒకటైతే, ప్రేమ పెళ్లిళ్లు మరొకటి. కుదుర్చుకొని చేసుకునే వివాహాలు తక్కువే అని చెప్పాలి. పెళ్లి చేయడం లేదా చేసుకోవడం చాలా సులభంగా మారింది. కానీ, ఇల్లు కట్టుకోవడమే గగనం. అందుకే గగనాన్ని తాకేలా అపార్టుమెంట్లు నిర్మించి అందులోనే ఉండిపోతున్నారు. నచ్చినా నచ్చకున్నా జీవితాన్ని గడిపేస్తున్నారు. కోట్లు ఖర్చుపెట్టి అపార్ట్‌మెంటును కొనుగోలు చేసినా కాస్త గాలి వచ్చేవిధంగా బాల్కానీ ఉంటే బాగుంటుందని అనుకోవడం పరిపాటే.
కానీ, తక్కవు స్పేస్ ఉండే అపార్ట్‌మెంట్లలో విశాలమైన బాల్కానీలు ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టం. కానీ, చైనా ఇంజనీర్లు బుర్రకు పదునుపెట్టి వినూత్నమైన అపార్ట్‌మెంట్లను నిర్మించారు. బాల్కానీలు పెద్దవిగా ఉండేలా డిజైన్ చేశారు. ప్రతి ఇంటి వెలుపల విశాలమైన బాల్కానీ ఇవ్వడంతో చూసేందుకు ఆ ఇల్లు చూడముచ్చటగా ఉన్నాయి. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా అనుకున్న విధంగా భూమిపై విశాలమైన ఇంటిని నిర్మించుకోలేకపోయినా… ఆకాశంలో గాలి వెలుతురు ఉండేలా ఇల్లు దొరకడం మేలేకదా అనుకుంటున్నారు. మనదగ్గర కూడా అపార్ట్‌మెంట్లలో ఇలాంటి ఇల్లు నిర్మిస్తే బాగుంటుంది కదా.