రాశిఫలాలు – జూన్‌ 7, శనివారం 2025

Daily Horoscope – June 7, 2025, Saturday

మేష రాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబం సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. దూర ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది. ఈరోజు ఈరాశివారు ఆకుపచ్చ దుస్తులు ధరించాలి. శ్రీమహాలక్ష్మి ఆరాధన శుభకరం.
వృషభ రాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనుల్లో వేగం తగ్గినా అనుకున్న వాటిని రోజు ముగిసేలోగా పూర్తి చేస్తారు. మానసికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు ఈరాశివారు నీలం రంగు దుస్తులు ధరించాలి. ధన్వంతరిని ఆరాధించడం శుభకరం.
మిథున రాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఓ శుభవార్త మీ చెవిన పడుతుంది. సన్నిహితుల సహకారంతో కీలక పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ, వృత్తి పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన అంశాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ఈరాశివారు తెలుపురంగు దుస్తులు ధరించాలి. దత్తాత్రేయుని ఆరాధన శుభప్రదం.
కర్కాటక రాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్ధులకు ఈరోజు కలిసి వస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. నూతన అవకాశాలు వస్తాయి. పెద్దల మాటకు విలువ ఇస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈరాశివారు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. సుబ్రహ్మణ్య ఆరాధన శుభకరం.
సింహ రాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. నూతన ఒప్పందాలు ప్రగతికి అనుకూలంగా మారతాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఆరోగ్యంపై దృష్టిసారించాలి. ఈరోజు ఈరాశివారు పసుపు రంగు దుస్తులు ధరించాలి. కులదైవాన్ని ఆరాధించాలి.
కన్యా రాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనులను పూర్తి చేస్తారు. పాత సమస్యలు తీరిపోతాయి. శుభవార్తలు వింటారు. కుటుంబం నుంచి పూర్తి మద్ధతు లభిస్తుంది. ధైర్యంతో అడుగులు వేస్తారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఈరోజు ఈరాశివారు ముదురు ఆకుపచ్చ దుస్తులు ధరించాలి. శక్తి స్వరూపాన్ని ఆరాధించాలి.
తులా రాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. ఖర్చులు పెరిగినా దానికి తగిన రాబడి వస్తుంది. అయితే కుటుంబ సభ్యుల నుంచి కొంత ఇబ్బందులు ఎదురుకావొచ్చు. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావొచ్చు. ఈరోజు ఈరాశివారు జేగురు రంగు దుస్తులు దరించాలి. సూర్యుని ఆరాధన శుభప్రదం.
వృశ్చిక రాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. సన్నిహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమౌతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈరోజు ఈరాశివారు కాషాయం రంగు దుస్తులు ధరించాలి. నరసింహ స్వామి ఆరాధన చేయడం మంచిది.
ధనుస్సు రాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తారు. ఈరోజు ఈరాశివారు వంకాయరంగు దుస్తులు ధరించాలి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
మకర రాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. అనుకోకుండా ధనం కలిసి వస్తుంది. నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. సంబంధాలు బలపడతాయి. ఈరోజు ఈరాశివారు గణపతిని ఆరాధించాలి.
కుంభ రాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మానసికంగా ఉల్లాసంగా కనిపిస్తారు. సన్నిహితులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్‌ ప్రణాళికలు వేసుకుంటారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు. విద్యార్ధులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు ఈరాశివారు గోధుమరంగు దుస్తులు ధరించాలి. గ్రామదేవతల ఆరాధన శుభప్రదం.
మీన రాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చేపట్టిన పనులు వీలైనంత త్వరగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మికరంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈరాశివారు చిలకపచ్చ రంగు దుస్తులు ధరించాలి. వీరభద్రుని ఆరాధన శుభప్రదం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *