మనలో చాలా మందికి డబ్బు దొరికితే బాగుండు… బంగారం దొరికితే బాగుండు అనుకుంటూ ఉంటారు. అయితే, ఇలా రోడ్డుపై లేదా మరెక్కడైనా ధనం లేదా బంగారం దొరికితే ఇంటికి తీసుకురావొచ్చా లేదా అన్నది చాలా మందికి తెలియదు. మనకు కష్టాలను, నష్టాలను, ఇబ్బందులు కలిగించేది ధనమే. ఆ ధనం దొరికితే ఎవరైనా సరే తెచ్చేసుకుంటారు. అయితే, అలా తెచ్చుకున్న ధనం, లేదా బంగారంతో చాలా ఇబ్బందులు వస్తాయని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు.
దొరికిన ధనాన్ని తీసుకురావడం వలన ఆర్ధికంగా ఎలా ఉన్నా మానసిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, పాపాలను మూటగట్టుకోవలసి వస్తుందని పండితులు చెబుతున్నారు. పోగొట్టుకున్నవారి బాధ తాలూకు విచారం మనకు సంక్రమించి మనల్ని పలు రకాలైన ఇబ్బందులకు గురిచేస్తుంది. పితృదోషాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. మరి ఇలా దొరికి ధనాన్ని ఏం చేయాలి అంటే లేనివారికి పంచాలని లేదా ధర్మకార్యక్రమాల కోసం వినియోగించాలని చెబుతున్నారు. ధనం దొరికినపుడు ఇంటికి తెచ్చుకోకుండా ఇలా దానం చేయడం వలన తప్పనిసరిగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒక్కసారి మనచేతి మీదనుంచి దానం చేయడం మొదలుపెడితే మనసు పడే సంతోషం అంతా ఇంతాకాదు. ఒకసారి ట్రైచేసి చూడండి మీకే తెలుస్తుంది.