ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ నవరాత్రోత్సవాలు అక్టోబర్ 2 వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతీ ఏడాది అమ్మవారిని పది రకాలైన అలంకారాలతో అలంకరించేవారు. అయితే, ఈసారి అదనంగా లోకమాత పేరుతో సరికొత్త అలంకారాన్ని ఇందులో చేర్చారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా అలంకరించనున్నారో, ఎటువంటి నైవేద్యాలను సమర్పించనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
11 రోజులు… 11 అలంకారాలు…
మొదటిరోజు
బాలా త్రిపుర సుందరీ దేవి
( తీపిబూoది, శెనగలు లేదా పెసరపప్పు పాయసం )
ఆరెంజ్ కలర్ శారీ
రెండోవరోజు
గాయత్రీ దేవి
( రవ్వకేసరి, పులిహోర )
బ్లూ కలర్ శారీ
మూడోవ రోజు
అన్నపూర్ణ దేవి
( దద్ధోజనం లేదా కట్టెపొంగలి )
పసుపు కలర్ శారీ
నాల్గోవ రోజు
కాత్యాయని దేవి
( బెల్లం అన్నం, అన్నం ముద్దపప్పు )
ఫుల్ రెడ్ కలర్ శారీ
ఐదోవ రోజు
మహాలక్ష్మీ దేవి
(పూర్ణాలు, క్షీరాన్నం, బెల్లం లేదా పంచదారతో చేసినది )
పింక్ కలర్ శారీ
ఆరోవ రోజు
లలితా త్రిపుర సుందరీ దేవి
( పులిహోర, పెసర బూరెలు )
గ్రీన్ కలర్ శారీ
ఏడవ రోజు
మహాచండీ దేవి
( లడ్డు ప్రసాదం )
రెడ్ కలర్ శారీ
ఎనిమిదో రోజు
సరస్వతి దేవి
( పరవణ్ణం, అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి )
వైట్ కలర్ శారీ
తొమ్మిదో రోజు
దుర్గాదేవి
( గారెలు, నిమ్మరసం కలిపిన అల్లంముక్కలు )
రెడ్ కలర్ శారీ
పదోవరోజు
మహిషాసురమర్ధిని దేవి
( చక్రపొంగలి, పులిహోర, గారెలు, వడపప్పు, నిమ్మరసం, పానకం )
రెడ్ కలర్ శారీ
పదకొండవ రోజు
రాజరాజేశ్వరి దేవి
( పులిహోర, గారెలు )
గ్రీన్ కలర్ శారీ
దేవీ నవరాత్రులు ప్రారంభం కావడానికి ముందు నుంచే నేటిప్రపంచం.కామ్ అమ్మవారి అలంకరణ విశేషాలు, రహస్యాలను ఆధ్యాత్మిక, పౌరాణిక, ఇతిహాసాలు, సామాజిక అంశాల మేళవింపుగా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు నేటిప్రపంచం.కామ్‌లో ప్రచురితమౌతుంది. తప్పకుండా చదవండి.