జ్యోతిష్యశాస్త్రం ప్రకారమే ప్రతి ఒక్కటీ జరుగుతుందా అంటే పండితులు అవుననే సమాధాం ఇస్తున్నారు. జ్యోతిష్యాన్ని మనం చిన్నచూపు చూసినా ఏదో ఒకరోజు అదే జీవితానికి వెలుగురేఖలా మారుతుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇంట్లోనూ, ఇంటి పరిసరాలలోనూ మార్పులు చేసుకుంటే లైఫ్ హుందాగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగుతుందని అంటారు. ఇవేమి పెద్దగా మనకు భారం కాదు. చిన్న చిన్న పరిష్కారాలే. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నవే అని వదిలేయకుండా వాటిని పక్కాగా అమలు చేయాలి. దక్షిణ దిశ అగ్ని మూలకంతో ముడిపడి ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో సూర్యుని శక్తి ఈ దిశలోనే ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ దిశలో తప్పనిసరిగా ఎరుపు రంగులో ఉండే మొక్కలను పెంచాలి.
దక్షిణ దిశ కుజుడు, యముడికి సంబంధించిన దిశ కూడా. ఈ దిశలో వేప మొక్కను పెంచడం వలన ఆయా గ్రహదోషాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. మందారం మొక్కను దక్షిణ దిశలో పెంచడం వలన దృష్టిదోషాలు తొలగిపోతాయి. వేప క్రిమి సంహారిగా పనిచేయడమే కాకుండా వర్షాకాలంలో ఈ చెట్టునుంచి వచ్చే గాలి పలు మహమ్మారులను నిర్మూలిస్తుంది. జ్యోతిష్యశాస్త్రం చెప్పిన విధంగా దక్షిణ దిశలో ఈ మొక్కలను పెంచడం వలన జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం.