శుక్రవారం ఈ పనులు అస్సలు చేయకండి

Lakshmi puja rules on Friday

శుక్రవారం హైందవులకు అత్యంత ముఖ్యమైన రోజు. ఈరోజు ఆధ్యాత్మికంగా పవిత్రంమైనదిగా భావిస్తారు. ప్రధానంగా మహాలక్ష్మిని ఈరోజున ఆరాధిస్తాం. సంపద, ఐశ్వర్యం, శాంతికి చిహ్నం లక్ష్మీదేవి. ఈరోజున ఆధ్యాత్మికంగా కొన్ని నియమాలను పాటించాలని, తద్వార ఆధ్యాత్మిక శ్రేయస్సును, శాంతిని, సంపదను, యశస్సును పొందుతారని పెద్దలు చెబుతున్నారు. మరి శుక్రవారం రోజున పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందామా.

శుక్రవారం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

శుక్రవారం అంటే శుక్రగ్రహానికి అధిపతిగా ఉన్న రోజు. ఇది ప్రేమ, సంతోషం, సౌందర్యం, సంపదను సూచిస్తుంది. అందుకే ఈరోజున శ్రీమహాలక్ష్మిని ఆరాధిస్తారు. ఫలితంగా ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కుటుంబంలో సుఖసౌఖ్యాలు నెలకొంటాయి. శుక్రవారం కొన్ని ఆచారాలను పాటించడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. జీవితంలో సానుకూల శక్తులను మీరు ఆహ్వానించినట్టు అవుతుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధనతో ఇంట్లోకి సానుకూల శక్తుల ప్రవాహం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఏర్పడుతుంది. ఆర్థికంగా పలు విధాలైన లాభాలుంటాయని పురాణాలు చెబుతున్నాయి.

శుక్రవారం రోజు పాటించవలసిన ఆధ్యాత్మిక నియమాలు

శుక్రవారం రోజున కొన్ని ఆధ్యాత్మికపరమైన నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. ఫలితంగా దైవానుగ్రహం లభిస్తుందని నమ్మకం. శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ చేసి ఉపవాసం ఉంటారు. కొందరు పూర్తిగా ఉపవాసం ఉంటే మరికొందరు ఫలమారం తీసుకుంటూ ఉపవాసం చేస్తారు. ఈ ఉపవాసం ఎందుకు చేయాలి అంటే మనసు శుద్ది చేసి దేవత ఆశీస్సులు పొందడానికి అని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం శుక్రవారం రోజున ఉపవాసం చేసిన వారికి లక్ష్మీదేవి తేలికగా ప్రసన్నరాలు అవుతుందని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తుందని నమ్మకం. శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచి, పూజా మందిరంలో దీపం వెలిగించాలి. లక్ష్మీ అష్టకం లేదా లక్ష్మీ సహస్రనామం లేదా కనకధార స్తోత్రం పఠించాలి. అమ్మవారిని పసుపు, కుంకుమ, సాధారణ పుష్పాలు, తామర పుష్పాలతో అలంకరించాలి. తామర పుష్పాలను దేవికి అలంకరించడం వలన అమ్మవారి ఆశీస్సులు త్వరగా లభిస్తాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, శుక్రవారం రోజున దానం చేయడం కూడా మంచిదే. స్త్రీలకు సంబంధించిన వస్తువులైన బంగారు ఆభరణాలు, దుస్తులు లేదా సౌందర్య వస్తువులను దానం చేయడం మంచిది. ఇక స్త్రీలకు గౌరవించడం వారికి సేవ చేయడం వలన శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతున్నది.

శుక్రవారం రోజు చేయకూడని పనులు

శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని రకాలైన పనులు చేయకూడదు. ఇలా చేయడం వలన శుక్రగ్రహ దోషాలనుంచి బయటపడొచ్చు. శుక్రవారం రోజున పులుపు పదార్థాలను తీసుకోకూడదు. అంటే నిమమ, పెరుగు, ఊరగాయలు తినరాదు. ఇవి శుక్రగ్రహ శక్తిని బలహీనపరుస్తాయని నమ్మకం. మహిళలను అవమానించకూడదు. వారిని వీలైనంత వరకు గౌరవించాలి. ఏడిపించడం చేయకూడదు. మహిళలు కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. శుక్రవారం రోజున అనవసరపు ఖర్చులు చేయడం మానుకోవాలి. శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. సుగంధ ద్రవ్యాలను ఉపయోగించాలి. ఇంట్లో ధూపం వేయాలి. ఇలా చేయకుంటే ఆ ఇంట్లోకి దారిద్ర్య దేవత వస్తుందని, ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని పండితులు చెబుతున్నారు.

పురాణాల ప్రకారం, శ్రీ లక్ష్మీ దేవి సముద్ర మంథనం నుండి ఉద్భవించినప్పుడు, ఆమె తామరపై కూర్చొని సౌందర్యం, సంపద, మరియు శాంతిని అందించే దేవతగా ప్రకాశించింది. శుక్రవారం రోజు ఆమెను ఆరాధించడం వల్ల ఆమె ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఒక పురాణ కథలో, ఒక పేద బ్రాహ్మణుడు శుక్రవారం రోజు లక్ష్మీ దేవిని భక్తితో ఆరాధించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి పొందాడని చెబుతారు.

ఎవరైతే ఈ నియమాలు పాటిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు శుక్రగ్రహ ఆశీస్సులు కూడా లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *