మన జీవితాన్ని అలవాట్లు ఎంతవరకు నిర్ధేశిస్తాయో తెలియదుగాని, మన శరీరంలోని అవయవాల అమరిక మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనడంలో సందేహం లేదు. దీనిని మనం జ్యోతిష్యశాస్త్రంతో ముడిపెడుతుంటారు. అదేవిధంగా వాస్తుశాస్త్రంతో కూడా జీవితాన్ని ముడిపెడతారు. శరీరంలోని ప్రతి అవయం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ముఖ్యంగా పాదాలు, పాదాల కాలివేళ్లు కూడా మన జీవితాన్ని నిర్ణయిస్తాయి.
కాలి బొటనవేలు పొడవుగా ఉండి, మిగతా నాలుగు వేళ్లు బొటనవేలు కంటే ఎత్తు తక్కువగా, సమానంగా ఉంటే అటువంటి వ్యక్తులు చాలా కూల్‌గా ఉంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొంటారు. ఇక కాలి బొటనవేలు కంటే పక్కన ఉన్నవేలు పొడవుగాను, దాని పక్కనున్న వేలు బొటనవేలు ఉన్నంత ఎత్తులోనూ, మిగిలిన రెండు వేళ్లు వాటికన్నా తక్కువ ఎత్తుగా ఉంటే అటువంటి చాలా క్రేజీగా ఉంటారు. ఏ విషయాన్నైనా సరే ఛాలెంజ్‌గా తీసుకొని సాధించేందుకు ప్రయత్నిస్తారు.
కాలి బొటనవేలు కంటే పక్కనున్న వేలు పొడవుగా, మిగతా వేళ్లు ఒకటదాని తరువాత ఒకటి ఎత్తు తక్కువగా స్టెప్స్ మాదిరిగా ఉంటే అలాంటి వారు యూనిక్‌గా కనిపిస్తుంటారు. నేర్చుకోవాలనే తపన వీరిలో కనిపిస్తుంది. కొత్త విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. అదేవిధంగా బొటలవేలు పొడవుగాను, మిగిలిన వేళ్లు ఒకదాని తరువాత ఒకటిగా చిన్నగా కింద నుంచి పైకి మెట్లు ఎక్కినట్టుగా పాదం ఉంటే అలాంటి వారు జీవితంలో ఎల్లప్పుడు డానినేట్ చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇంట్లో, ఆఫీసులో, లైఫ్‌లో ఎక్కడైనా వీరిదే పైచేయిగా ఉంటుంది.
ఇక పాదంలోని మొదటి మూడు వేళ్లు సమానంగాను, చివరి రెండు వేళ్లు స్టెప్స్ మాదిరిగా చిన్నగా ఉంటే వీరు కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ కష్టాన్ని నమ్ముకొని ఉంటారు కాబట్టి చివరకు వీరు విజయం సాధిస్తారు. మరి ఇక్కడ చెప్పిన విధంగా, అదేవిధంగా, ఈ వీడియోలో చూపిన విధంగా పాదాల వేళ్లు ఉన్నాయా… ఉంటే మీ మనస్తత్వం ఉన్నదా లేదా నేటిప్రపంచం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీలైతే మీ పాదాలను ఫొటోగా తీసి కూడా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి.