వెయ్యేళ్ల క్రితం వరకు అగ్రవర్ణాల గొప్పదనం అంతా. వెయ్యేళ్ల కాలంలో ఎన్నో మార్పులు. విదేశీయుల దండయాత్రలు. ఆ తరువాత ఆంగ్లేయుల పాలన. విదేశీయుల దండయాత్రల్లో అప్పటి వరకు అద్భుతంగా కొనసాగిన వేదాలు, వేదాంతాలు, ఆలయాల వైభోగం క్రమంగా మసకబారటం మొదలైంది. ఆంగ్లేయుల పరిపాలన కాలం నాటికి ఇది మరింతగా దిగజారింది. ఎంత మసకబారినా…అగ్రవర్ణాల జీవనం కుంటుపడుతున్న వర్ణవ్యవస్థను కాపాడుకుంటూ వచ్చారు. కాలానుగుణంగా ఎన్నో మార్పులు జరగుతున్నాయి. ఇతర వర్ణాల వారు వివిధ రకాలైన పనుల్లో నిమగ్నమయ్యారు. ఉద్యోగాల పేరిట పట్టణాలు, నగరాలకు వలసవెళ్లి దర్జాగా బతుకుతున్నారు. కానీ, అగ్రవర్ణాల వారు జీవనం సాగించడం కష్టంగా మారుతున్నా మనుగడను రక్షించుకోవడానికి నేటికీ అవస్థలు పడుతూనే ఉన్నారు. వివాహాలు, పండుగలు, పర్వదినాల్లో వచ్చే చిన్నపాటి సంభావన లేదా ప్రభుత్వం అందించే చిల్లర జీతాలు. వీటితోనే కాలం గడుపుతున్నారు. తాను తింటానికి లేకున్నా ఆలయంలోని దైవానికి ఏ విధంగానైనా నైవేద్యం సమర్పించాలి.
ఉన్నదాంట్లోనే తాను తినాలి. తన కుటుంబాన్ని బతికించుకోవాలి. పెళ్లిళ్ల సీజన్‌లోనే కొద్దిపాటి పని ఉంటుంది. ఆ నాలుగు రోజులు సంపాదించుకున్న సంపాదనతోనే ఏడాది మొత్తం గడపాలి. తనకు కాలంతోపాటు మారాలని ఉన్నా అగ్రవర్ణం అనే భుజకీర్తులను కాపాడేందుకు పడే తపన అంతాఇంతా కాదు. ఒకేరోజు రెండు మూడు చోట్ల పెళ్లిళ్లు చేసి నిద్రాహారాలు మాని పరగులు తీస్తాడు. పెళ్లిలో ఇచ్చిన సంభావన, తమ కష్టాలు, నష్టాలను బియ్యం, కాయల రూపంలో బ్రాహ్మణుడికి సమర్పిస్తారు. అలాంటివి తీసుకోవడం వలన వారి దురదృష్టాన్ని తీసుకుంటున్నట్టు తెలిసినా కడుపు నింపుకోవడం కోసం అంతకు మించిన గత్యంతరం లేదు. లక్షల్లో ఒకరిద్దరికి మినహా చాలా మందివి అరకొర సంపాదనే. ఒకరిద్దరినే సాకుగా చూపించి అందరూ ఇలానే దండుకుంటున్నారని అవహేళన చేయడం మనం చూస్తూనే ఉన్నాం.
లక్షల్లో జీతాలు తీసుకునేవాళ్లు కూడా పెళ్లి సంభావన వెయ్యినూటపదహారుతో సరిపెట్టేస్తున్నారు. మంటపాల కోసం, భోజనాల కోసం లక్షలు ఖర్చుచేస్తూ చేసుకుబోయే వివాహం నిండు నూరేళ్లు కొనసాగాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడాలని, వేదమంత్రాల సాక్షిగా, అగ్నిసాక్షిగా వివాహాన్ని జరిపించే బ్రాహ్మణుడికి ఇచ్చేది కేవలం వెయ్యినూటపదహారే. ఇప్పటికైనా మనం మారాలి. వైదిక బ్రాహ్మణులను బతికించాలి. వేదసంప్రదాయాలను మరో వెయ్యేళ్లు ముందుకు తీసుకెళ్లాలి. ఇక్కడ ఇచ్చిన ఈ వీడియో చూస్తే పాపం ఆ బ్రాహ్మణుడు పెళ్లివాళ్లు ఇచ్చిన వాటిని, సంభావన కింద ఇచ్చిన వెయ్యినూటపదహారు రూపాయలను తీసుకొని ఏం మాట్లాడకుండా ఎలా వెళ్లిపోతున్నాడో చూస్తే కంటతడి వచ్చేస్తుంది. వృధాగా ఎంతో ఖర్చుపెడుతున్న మనం మనబాగుకోసం వేదమంత్రాలను చదివే వైదిక బ్రాహ్మణులకు కొంత సహాయం చేస్తే బాగుంటుంది. వైదిక ధర్మాన్ని బతికిస్తే ఇంకా బాగుంటుంది.
బ్రాహ్మణునికి విలువ ఇవ్వాలి – ఎందుకు?
వేదసంస్కృతిని ముందుకు తీసుకెళ్లేందుకు:
- బ్రాహ్మణులు జీవితం అర్పించారు
- కుటుంబ జీవన సౌకర్యాలకన్నా దైవ సేవకే ప్రాధాన్యత ఇచ్చారు
- ధన సంపాదన కన్నా ధర్మ సంపాదనను ఎంచుకున్నారు
కాబట్టి, మనం కూడా వారికి గౌరవించాల్సిన బాధ్యత ఉంది.
మారాలి… మారాలనే కోరుకుందాం
నేటి సమాజం ఆచారాల్ని పాటిస్తూ:
- వేదమంత్రాలకు విలువ ఇవ్వాలి
- బ్రాహ్మణులకు సత్యమైన సంభావన ఇవ్వాలి
- వారి జీవితానికి భద్రత కల్పించాలి
- వారి పిల్లల విద్య, జీవన శైలికి తోడ్పడాలి
ఇలా చేస్తే, వేద సంప్రదాయం వెయ్యేళ్లు కాదు – మరిన్ని యుగాల వరకూ బతుకుతుంది.
ముగింపు సందేశం
వేదసంస్కృతి మనకు ఐడెంటిటీ. దీన్ని కాపాడాలంటే, దీన్ని రక్షించే వారిని కూడా ఆదుకోవాలి. మతపరంగా, ఆధ్యాత్మికంగా, దేశవైభవంగా – బ్రాహ్మణులు పోషించిన పాత్రను గుర్తించి:
“వేద భద్రత = భారత సంస్కృతి భద్రత” అని మనం గుర్తుంచుకోవాలి.
ఈ కథ విన్న ప్రతి ఒక్కరు… ఒక్కసారి ఆలోచించాలి –
“బ్రాహ్మణుడి బతుకు కాపాడితే… వేదం నిలబడుతుంది – వేదం నిలబడితే మనం నిలబడతాం.”