అదిగో భద్రాద్రీ…గౌతమినిదిగో చూడండి అంటూ భద్రాచలం విశిష్టతను డా.మంగళం పల్లి బాలమురళీకృష్ణ తన గానమాధుర్యంతో పాడినట్టుగానే ఇదిగో నీలాచలం కొండపై ఉన్న ఈ కొలను చూడండంటూ ‘నేటి ప్రపంచం.కామ్’ ఫోటోలతో ఇక్కడి చెక్కు చెదరని త్రేతాయుగం నాటి రాముడు నడియాడిన ,ద్వాపరయుగంలో పంచపాండవులు పాదం మోపిన ఎన్నో ఏళ్ల చరత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచన ఏపీలోని ఉత్తరాంద్రలోని విజయనగరంకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామతీర్ధం నీలాచలం బోడి కొండపై కొలువైన అలనాటి శ్రీ సీతారామలక్ష్మణులు కొలువైన ఉన్న స్థలాన్ని చిత్రమాలికలతో మీకు అందిస్తోంది.
దైవీత్మకమైన మనస్సు,ప్రశాంతమైన బుద్దితో ముక్కోటి ఏకాదశి పర్వదినాన నేటి.ప్రపంచం.కామ్ వీక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తోంది…వీక్షించండి.ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శ్రీరామతీర్ద,సీతారామ దేవాస్థానం ఆద్వర్యంలో రామతీర్ధంలోని ముక్కోటి ఏకాదశి పర్వదినం మంగళవారం కన్నుల పండువగా సాగింది.ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీమహావిష్ణువు మంగళవారం ఇదే రోజున పొద్దున్న నాలుగు గంటలనుంచీ 31 ఉదయం అయిదుగంటల వరకు దివి నుంచీ భువిపైకి వచ్చాడని వేద పండితులు,బ్రహ్మవేత్తలు,తత్వజ్ఙానులు,యోగులు,రుషులు శాస్త్రాలు చెప్పిన మాటలవి.
ఈ నేపధ్యంలో దేవస్థానం తెల్లవారుజాము నుంచీ ఇటు నీలాచలం బొడి కొండపైన,అటురామతీర్ధం దేవాలయంలోని భక్తుల దైవ దర్శనానికి ఏర్పాట్లు చేసింది. విశేషం ఏంటంటే నెల్లిమర్ల నియోజక వర్గంలోనే కొలువై ఉన్నాయి ఈ రామతీర్ధం,నీలాచలంలు.ఇక ఎప్పటి నుంచీ నీలాచలం గిరి ప్రదర్శన చేయాలని, అది కొండపై నుంచీ కాకుండా కొండ దిగువ భాగం నుంచీ ఆ గిరి ప్రదర్శన చేయాలన్న ప్రతిపాదనకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవిశ్రీకారం చుట్టడం, అది అమలయ్యేలా శ్రీ రామతీర్ధ సేవా సమితి జ్యోతి ప్రసాద్, ఉత్తరాంద్ర సాధు పరిషత్ అధిపతి శ్రీ శ్రీనివాసానంద సరస్వతి సంకల్పంతో ఆ ప్రతిపాదన కాస్త అమలుకు నోచుకుని ఎట్టకేలకు ముక్కోటి ఏకాదశి పర్వదినాన భక్తులందరూ నీలాచలం గిరి ప్రదర్శన చేయడం విశేషం.కొండపై ప్రశాంత వాతావరణం,ప్రకృతి రమణీయతకు అద్దం పట్టింది. అయితే అతి ప్రసాశస్తమైన,అతి పురాతనమైన ఈ నీలాచలం(బోడికొండ) కొండపై ఉన్న అలనాటి రాములోరి విగ్రహ తలను కొంతమంది అన్యమతస్థులు విరగ్గొట్టి దిగువన ఉన్న చెరువులో పడేయడంతో ఒక్కసారి హైందవ జాతి కెరటం ఎగిసింది. బోడి కొండపై ముందే హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి…
ఎంతవరకు ఆ ఆందోళన వెళ్లిందంటూ సాక్షాత్ శ్రీ స్వామి చినజీయర్ నే స్వయంగా వచ్చి జరిగిన ఘటన హైందవ జాతికే ఒక మాయని మచ్చని పేర్కొని,ఏడాదిలోపు తిరిగి నీలాచలం కొండపై కొత్త ఆలయం నిర్మాణం జరిగి తీరాలని చెప్పారు. దీంతో అప్పటి జగన్ ప్రభుత్వం ఆఘమేఘాల మీద దాదాపు 3 కోట్ల ఖర్చు పెట్టి మరీ కొత్త విగ్రహాలను ఆపై నీలాచలం కొండపై కొత్త ఆలయాన్ని పునర్మించి ప్రాయశ్చిత్తం చేసుకుంది.