వాస్తు ప్రకారం వంటగది ఇలా లేకుంటే…జీవితంలో అన్నీ కష్టాలే

Vastu for Kitchen Avoid These Mistakes to Prevent Financial and Family Problems
Spread the love

ఇంటి విషయంలో వాస్తు పక్కాగా ఉండాలి. ఏ మాత్రం తేడాగా ఉన్నా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆర్థికంతో పాటు సామాజికంగా, కుటుంబపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా వంటగదిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. వంటగదిలోని సామానులను కూడా వాస్తు ప్రకారమే ఏర్పాటు చేసుకోవాలి. వంటగదిలోని అలమరాల్లో సామానులను తలక్రిందులుగా బోర్లించి పెడుతుంటారు. వాస్తు ప్రకారం ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

వంటపాత్రలను తలక్రిందులుగా పెట్టడం వలన ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కుటుంబంలో వివాదాలు చోటు చేసుకుంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తవాను కూడా తిరగేసి పెట్టకూడదు. అదేవిధంగా ఎప్పటికప్పుడు క్లీన్‌ చేసి పెట్టుకోవాలి. లేదంటే జీవితంలో ఆర్ధికంగా ఇబ్బందులు తలెత్తుతాయి. అప్పులు పెరుగుతాయి. చేపట్టిన పనిలో అంతరాయం ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో అవాంతరాలు ఏర్పడతాయి. వంటగది నిర్మాణం కూడా వాస్తు ప్రకారమే ఉండాలి. వంటగది ఎల్లప్పుడూ పశ్చిమ దిశలో ఉండాలి. ఇక, రాత్రి సమయంలోనూ పాత్రలను శుభ్రం చేసి పెట్టుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వంటగది, పాత్రలు, వంట చేసేందుకు ఉపయోగించే పొయ్యి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని వాస్తునిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *