దేవాలయానికి వెళ్లిన సమయంలో పూజారి మనకు తీర్థం ఇస్తారు. తీర్థాన్ని గోకర్ణముద్ర వేసి తీసుకుంటాం. తీర్థం తీసుకున్న తరువాత చాలా మంది చేతిని తలకు రాసుకుంటారు. జ్యోతిష్య, హైందవ సంప్రదాయాల ప్రకారం తీర్థం పవిత్రమైన జలం. దీనినే గంగాజలం అని కూడా పిలుస్తాం. భగవంతుడిని అభిషేకించిన తరువాత పవిత్రంగా మారిన జలాన్ని తీర్థంగా భక్తులకు అందిస్తారు. తీర్థం తీసుకున్న తరువాత చేతిని తలకు రాయడం ఓ అలవాటుగా మారింది. అయితే, ధర్మశాస్త్రాల ప్రకారం చేతిని తలపై త్రిపుండ్రం లేదా నమస్కారానికి సూచనగా రాయడం ద్వారా శుద్ధి, క్షమాపణ, దైవకృప పొందేందుకు సూచనగా చెబుతారు. తీర్థం అనేది ప్రసాదంగా చెబుతారు కాబట్టి దానిని తలపై ఉంచడం కూడా శుభదాయకమనే చెప్పాలి. ఇక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చూసుకుంటే తీర్థం భౌతిక, మానసిక శరీరాన్ని శుద్ధి చేస్తుంది. పుణ్యఫలాలను ఇస్తుంది. మనిషి తలపై బ్రహ్మరంధ్రం ఉంటుంది. దీనినే శక్తికేంద్రంగా చెబుతాం. తీర్థం తీసుకున్న తరువాత చేతిని తలపై రాయడం వలన బ్రహ్మకేంద్రానికి ఆధ్యాత్మిక శక్తి అందుతుందని, పాపాలు క్షమించబడతాయని చెబుతారు. తీర్థం తీసుకున్న తరువాత ఎవరు తలపై చేతిని రాయకూడదు అనే దానిపై కూడా శాస్త్రాలు కొన్ని వివరణలు ఇచ్చాయి. మనసు మాలిన్యంతో నిండిపోయినవారు, భగవంతునిపై నమ్మకం లేనివారు, పలు రకాలైన చింతలున్నవారు చేతిని తలపై రాకూడదని చెబుతారు.
Related Posts

పూరీ జగన్నాథుడి అనారోగ్య రహస్యం తెలిస్తే షాకవుతారు
వైష్ణువుల 108 దివ్య దేశాల్లో పూరీ జగన్నాథ్ కూడా ఒకటి. పూరీని మోక్షపురి అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీమహావిష్ణువు జగన్నాథుడి రూపంలో దర్శనమిస్తాడు. జగన్నాథుడిని నిత్యం…
వైష్ణువుల 108 దివ్య దేశాల్లో పూరీ జగన్నాథ్ కూడా ఒకటి. పూరీని మోక్షపురి అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీమహావిష్ణువు జగన్నాథుడి రూపంలో దర్శనమిస్తాడు. జగన్నాథుడిని నిత్యం…

మనిషి ఆధ్యాత్మికంగా అడుగులు వేస్తే… ఎలాంటి విజయాలు సాధించగలడో తెలుసా?
ఈ ఆధునిక యుగంలో విజయం అంటే ఎక్కువ మంది ధనం, పదవి, పేరు ప్రతిష్ట వంటి విషయాలను మాత్రమే చూస్తారు. కానీ ఇవన్నీ ఒక్క సారి మనకి…
ఈ ఆధునిక యుగంలో విజయం అంటే ఎక్కువ మంది ధనం, పదవి, పేరు ప్రతిష్ట వంటి విషయాలను మాత్రమే చూస్తారు. కానీ ఇవన్నీ ఒక్క సారి మనకి…

భగవంతుడిని సులభంగా చేరుకునే ఏకైక మార్గం
ఎలా పూజించాలి? భగవంతుడిని ఎలా పూజించాలి. దీనికి ఎవరికి నచ్చినట్టుగా వారు ఉపాఖ్యానాలు ఇస్తుంటారు. సాధారణంగా ఇంట్లోని దేవుని గదిలో ఒకవిధంగా పూజ చేస్తే, ఆలయంలో గర్భగుడిలో…
ఎలా పూజించాలి? భగవంతుడిని ఎలా పూజించాలి. దీనికి ఎవరికి నచ్చినట్టుగా వారు ఉపాఖ్యానాలు ఇస్తుంటారు. సాధారణంగా ఇంట్లోని దేవుని గదిలో ఒకవిధంగా పూజ చేస్తే, ఆలయంలో గర్భగుడిలో…