మనం ఎప్పుడు మరణిస్తాం అంటే చెప్పడం కష్టం. మనకు నచ్చనపుడు మరణించే అవకాశం ఉండదు. నచ్చినంత కాలం బతికే అవకాశం కూడా ఉండదు. కానీ భీష్ముడు అలా కాదు. తాను కోరుకున్న సమయంలో మరణించే అవకాశం భీష్ముడికి మాత్రమే ఉంది. భీష్ముడు కురుక్షేత్రంలో పాండవులు, కౌరవుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అంపశయ్య మీద ఉండగా, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముడు ఆ సమయంలో తన దగ్గరకు వచ్చిన పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ సమయంలో తన దగ్గరకు వచ్చిన పాండవులకు ధర్మోపదేశాన్ని చేశాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ధర్మరాజుకి రాజనీతి గురించి రాజధర్మం, నడవడిక, ఆహారం వంటి అనేక సూక్ష్మమైన విషయాలను కథల రూపంలో తెలియజేశాడు. భీష్మపితామహుడు రాజనీతి గురించి ధర్మరాజుకి చేసిన ఉపదేశాలతో నిండిన శాంతిపర్వం మహాభారతంలోనే ఒక అరుదైన ఘట్టం. మహాభారతంలోని తృతీయాశ్వాసంలోని ఈ కథను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకొని తీరాలని పండితులు చెబుతున్నారు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.
అనగనగా విదిశాపట్నం. ఆ పట్టణంలో బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వారికి ఓ పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని అల్లారుముద్దుగా పెంచుకున్నది ఆ కుటుంబం. అయితే, అనుకోకుండా కుమారుడు మరణించడంతో ఆ కుటుంబం భోరున విలపిస్తుంది. పిల్లవాడు ఉదయం మరణించడంతో మధ్యాహ్నం వరకు స్మశానానికి తీసుకెళ్తారు. స్మశానానికి తీసుకెళ్లినప్పటికీ ఆ బాలుడిని ఖననం చేయకుండా విలపిస్తూనే ఉంటారు. ఈలోగా అక్కడికి ఒక గద్ద వస్తుంది. చీకటిపడేలోగా బాలుడి శవాన్ని ఖననం చేయమని చెబుతుంది. చీకటి పడకముందే చేయకుంటే బాలుడి ఆత్మ శాంతించదని హితబోధ చేస్తుంది. కానీ, బాలుడి శరీరాన్ని అక్కడ వదిలి వెళ్లేందుకు తల్లిదండ్రులు ఇష్టపడరు. ఈలోగా అక్కడికి నక్క వచ్చి వారిని ఓదార్చుతున్నట్టుగా నటించడమే కాకుండా, చీకటి పడిన తరువాతే ఖననం చేయమని, అదృష్టం ఉంటే దేవతలో లేదా యక్షులో, కిన్నెరలో ఎవరో ఒకరు వచ్చి బాలుడిని బతికిస్తారని నక్క వినయంగా చెబుతుంది. రాత్రి సమయంలో గద్దలు ఆహారాన్వేషణ చేయదు. నక్క రాత్రిళ్లు మాత్రమే ఆహారాన్ని అన్వేషిస్తుంది. ఈ నేపథ్యంలో నక్క, గద్ద రెండూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రగడ చేస్తాయి.
నక్క మాటలు వినొద్దని, పోయిన ప్రాణం తిరిగిరాదని గద్ద చెబుతుంది. గద్దమాటలు విన్న బ్రాహ్మణ దంపతులు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్దమయవ్వగా…నక్క కలుగజేసుకొని గద్ద మనసు మహా కౄరమైందని దాని మాటలు వినొద్దని చెబుతుంది. అంతేకాదు, పూర్వం రాముడు బ్రాహ్మణుడిని బతికించిన కథ వినలేదా అని నక్క చెబుతుంది. ఏ దేవతో, యక్షుడో మీ కుమారుడిని తప్పకుండా బతికిస్తాడని నక్క చెప్పి బ్రాహ్మణ కుటుంబం వెళ్లకుండా అడ్డుకుంటుంది. చీకటి పడుతున్న సమయంలో రుద్రభూమికి మహాశివుడు వస్తాడు. బ్రాహ్మణుడి దీనావస్థను చూసి జాలిపడిన శివుడు ఏమికావాలో కోరుకోమన్నాడు. దానికి ఆ భార్యభర్తలు తమ బిడ్డను బతికించమని కోరుకుంటారు. వెంటనే మహాశివుడు ఆ బాలుడికి ప్రాణం పోస్తాడు. అయితే, తమ ఆకలి తీర్చుకునేందుకు బ్రాహ్మణ కుటుంబాన్ని మోసం చేయాలని చూసిన నక్క గద్దలకు ఆకలిలేకుండా జీవించేలా వరం ఇస్తాడు మహాశివుడు. అందరూ తమ అవకాశాలను, అవరాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో మాటలు చెబుతారు. చెప్పిన మాటలన్నీ మనకోసమే అని నమ్మకూడదు. లౌక్యాన్ని ప్రదర్శించాలి. ఎదుటివారి కష్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి వారి కపటాన్ని గుర్తించి, వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలని ఈ కథ చెబుతోంది.