లెజెండరీ నటుడు రజనీకాంత్ యొక్క తాజా చిత్రం కూలీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. 2025 యొక్క అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంతో, సూపర్‌స్టార్ రజనీకాంత్ తన సినీ ప్రస్థానంలో 50 ఏళ్ల ఐకానిక్ జర్నీని పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అభిమానులకు ఒక ఉత్సవం, సంబరం లాంటిది కూడా. ఈ సంబరాన్ని ఆయన ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. థియేటర్ల వద్ద టపాసులతో మోత మోగించారు. అయిదే ఒకటే రోజున ప్రఖ్యాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2తో బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయి. డే1 కూలీ పైచేయి సాధించినట్టుగా కలెక్షన్లను బట్టి తెలుస్తోంది.
కూలీ బాక్సాఫీస్ కలెక్షన్ డే 1
కూలీ సినిమాకు మొదటి నుంచి హైప్ ఉంది. సోషల్ మీడియాలో వచ్చిన ఒపెనింగ్ రివ్యూస్‌తో సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. ఈ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్ సాధించింది, హృతిక్ రోషన్ యొక్క వార్ 2ని మొదటి రోజు కలెక్షన్లలో అధిగమించింది. సాక్నిల్క్ ప్రకారం, కూలీ భారతదేశంలో తొలి రోజు రూ. 65 కోట్లు, అంతర్జాతీయ మార్కెట్ల నుండి మరో రూ. 60 కోట్లు జోడించింది.
అయితే, వార్ 2 తొలి రోజు రూ. 52.5 కోట్లు సంపాదించింది. దీన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో కూలీ వార్ 2 కలెక్షన్లను బీట్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువ కలెక్షన్లు కూలీకి రాగా, తెలుగు రాష్ట్రాలు, ఉత్తర భారత దేశంలో వార్ 2 మోత మోగించింది. కానీ లోకేష్ కనగరాజ్ గత చిత్రం లియో ఓపెనింగ్ డే కలెక్షన్లను మాత్రం కూలీ బీట్ చేయలేకపోయింది. లియో ఓపెనింగ్ డే రోజున రూ. 148 కోట్లు సాధించింది.
ఇండస్ట్రీ రిపోర్టుల ప్రకారం, కూలీ తొలి రోజు రూ. 130 కోట్ల మార్క్‌ను తాకే అవకాశం ఉందని అంచనా. ఇది కేవలం అంచనా మాత్రమే. పూర్తి వివరాలు ఆగస్టు 15 ఉదయం వరకు కానీ అందుబాటులోకి రావు. లియో రికార్డును బీట్ చేయలేకపోయినప్పటికీ, రజనీ కెరీర్‌లో ఇదొక బెస్ట్ కలెక్షన్లే చెప్పాలి. వరసగా సెలవులు రావడంతో మరికొన్ని రోజులపాటు కూలీ రికార్డుల మోత మోగుతుందని, తమిళనాడులో వెయ్యి కోట్ల మార్క్‌ను చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధిస్తే… ఈ ఘనత సాధించిన తొలి తమిళ సినిమా కూలీనే అవుతుంది. మరి కూలీ రాత ఎలా ఉందో మరికొన్ని రోజుల్లోనే తేలిపోతుంది.