సాధారణ సమాజంలోనే కాదు… సినిమా ఇండస్ట్రీలో సింగిల్‌గా ఉన్న హీరోలు, హీరోయిన్లు పెరిగిపోతున్నారు. ఎందుకు సింగిల్‌గా ఉంటున్నారు అంటే దానికి తగిన సమాధానాలు ఉండవు. వివాహం తరువాత కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందో అనే భయం ఒకటైతే, సినిమా ఇండస్ట్రీలో మ్యారేజ్ తరువాత వారిని చూసే విధానం కూడా మారిపోతుంది. ఫలితంగా కెరీర్‌ను అక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టడమో లేదంటే అక్క, చెల్లి, తల్లిగానో యాక్టింగ్ చేయవలసి వస్తుంది. బహుశా అందుకే హీరోయిన్లు రిటైర్ అయ్యే వరకు వైవాహిక బంధానికి దూరంగా ఉంటున్నారు.
ఒక స్ట్రీ సంపూర్ణ మహిళగా ఎప్పుడు మారుతుంది అంటే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి, పిల్లలకు తల్లి అయినపుడు మాత్రమే. సంపూర్ణ మహిళలుగా మారిన చాలా మంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలో వివిధ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తూనే ఉన్నారు. దానికో ఉదాహరణ జెనీలియా. పిల్లలకు తల్లి అయినప్పటికీ ఆమెలో చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. అదే చలాకీతనంతో ఇండస్ట్రీలో రాణిస్తున్నది. ఆమెను చూసి చాలామంది ఇన్పైర్ అవుతున్నారు. అంతేందుకు సింగిల్ ఉన్నవారు కూడా జెనీలియాను చూసి షాకవుతున్నారు. అటువంటి దృశ్యం ఒకటి ఇటీవలే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. జెనీలియా, ఆమె భర్త ఇద్దరూ నిలబడి నవ్వుకుంటూ మాట్లాడుకుంటుండగా, ఆమె వెనుక నుంచి వస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే ఓ లుక్కు ఇస్తూ వచ్చింది. ఈ లుక్కు వెనుకనున్న అర్ధాలేంటని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి సమాధానం పూజా హెగ్డేనే చెప్పాలి.