ఆది సాయి కుమార్ తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టే ఒక బలమైన కమర్షియల్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలోనే ఈసారి పూర్తిగా భిన్నమైన, మిథికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ‘శంభాల’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రహస్యం, ఉత్కంఠతో నిండిన ఈ సినిమా ఇప్పటికే మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది.
ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పుడు, డిసెంబర్ 25న సినిమా రిలీజ్‌కు ముందుగా మేకర్స్ మరో ఆసక్తికరమైన మిథికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న బజ్‌ను మరింత పెంచింది. విజువల్స్, నరేషన్ అన్నీ కూడా ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయి.
ఈ తాజా ట్రైలర్ మరోసారి స్పష్టంగా చెప్పేది ఏంటంటే… ‘శంభాల’ అనేది ఒక గ్రామం చుట్టూ తిరిగే రహస్య కథ. ఆ గ్రామంలోకి ఒక సూపర్‌నేచురల్ శక్తి ప్రవేశించడం తో భయంకర సంఘటనలు మొదలవుతాయి. పంచ భూతాలను నియంత్రించే శక్తి కలిగిన ఆ శక్తివంతమైన అంశం గ్రామాన్ని కల్లోలంలోకి నెట్టేస్తుంది. భయం, గందరగోళం గ్రామాన్ని కమ్మేస్తాయి.
ఆది సాయి కుమార్ ఈ సినిమాలో ఒక జియో సైంటిస్ట్ పాత్రలో కనిపిస్తాడు. అతడు ఆ భయానక శక్తులను ఎదుర్కొంటూ, తన సంకల్ప బలంతో వాటిని ఛాలెంజ్ చేస్తాడు. తన లక్ష్యాన్ని అడ్డుకునే గ్రామస్తులతో కూడా అతడు తలపడాల్సి వస్తుంది. ఆది లుక్, మేకోవర్, అలాగే అతని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
దర్శకుడు ఉగంధర్ ముని ఈ సినిమాను పక్కా థ్రిల్స్, చిల్స్‌తో రూపొందించినట్లు ట్రైలర్ చెబుతోంది. విజువల్స్ చాలా స్టన్నింగ్‌గా ఉన్నాయి. టెక్నికల్ విలువ్స్ కూడా హై స్టాండర్డ్‌లో కనిపిస్తున్నాయి. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అందించిన హాంటింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని ఉత్కంఠను మరింత పెంచుతోంది. నిర్మాణ విలువలు కూడా ప్రతి ఫ్రేమ్‌లో కనిపించేలా బలంగా ఉన్నాయి.
మొత్తంగా చూస్తే, ‘శంభాల’ మిథికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. విజువల్స్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ నరేషన్‌తో ఈ సినిమా వచ్చే వారం మంచి ఓపెనింగ్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.