దీపావళి అంటే శ్రీలీలకి చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. పటాసుల శబ్దం, వెలుగులు, చాక్లెట్ల వాసన — అన్నీ కలిసి పండుగ వాతావరణం ఆమె మనసును ఆనందంతో నింపుతాయి. కానీ ఆమెకు సౌండ్ బాంబులు మాత్రం అంతగా నచ్చవు. “పటాకులు కాల్చడం సరదా కానీ, మూగజీవాలు భయపడకూడదు” అని చెబుతుంది శ్రీలీల. పండుగ ఆనందాన్ని పంచుకోవడమే గానీ, బాధ కలిగించకూడదని ఆమె అభిప్రాయం.
శ్రీలీల ఇంట్లో దీపావళి ప్రత్యేకమే. ఇంటి పెద్దలంతా ఆమెను అఖండదీపం అంటే… అన్నలు మాత్రం సరదాగా ఆమెను ‘చిచ్చుబుడ్డి’ అని పిలుస్తారు. పండుగ రోజు ఆమె చీర కట్టుకుని కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొంటుంది. “దీపావళి రోజున తల్లి చేతి వంటలు తింటే అంతకంటే ఆనందం ఇంకేదీ ఉండదు” అని ఆమె చిరునవ్వుతో చెబుతుంది. కానీ ఈ ఏడాది దీపావళి పండుగకు తాను ఇంట్లో అందుబాటులో ఉండటం లేదని అంటోంది.
కష్టాలను ఎదుర్కొని గ్రూప్ 2 విజేతగా నిలిచిన కానిస్టేబుల్
సినీ ప్రపంచంలో కూడా శ్రీలీల ఇప్పుడు వెలుగుల దీపంలా మెరుస్తోంది. కన్నడ చిత్రాలతో మొదలైన ఆమె ప్రయాణం తెలుగు సినిమాలతో మరింత బలపడింది. “తెలుగు ప్రేక్షకుల ప్రేమే నన్ను నిలబెట్టింది” అని ఆమె గర్వంగా అంటుంది. ఇక ఇప్పుడు హిందీ సినిమాల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని చెబుతోంది.
దీపావళి తర్వాత రాబోయే తన కొత్త సినిమా మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీలీల, “ఈసారి స్క్రీన్‌పై దుమ్మురేపుతాను” అంటుంది. వెలుగుల పండుగలా ఆమె కెరీర్ కూడా మరింత ప్రకాశించాలని అభిమానులు కోరుకుంటున్నారు.