టాలీవుడ్ వెర్సటైల్ నటుడు అడివి శేష్ ఇంకా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న డకాయిట్ సినిమా పై బాగానే అంచనాలు ఉన్నాయ్… ఇక ఈరోజు రిలీజ్ చేసిన టీజర్ తో అవి ఇంకో రేంజ్ కి వెళ్లిపోయాయి… ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తుండడం తో మంచి కాన్సెప్ట్ తో వస్తారు అన్న మాట కూడా ఉంది…
ఐతే ఈరోజు రిలీజ్ చేసిన టీజర్ లో ఒక surprise ఉంది… అదేంటో చూసి చెప్పండి…
చూసారా… ఆ పాట అదే పాట… నాగార్జున సూపర్ హిట్ సాంగ్, “కన్నుకొట్టారో…” ఈ పాట ని ఇక టీజర్ లో అది కూడా చరక్టర్లు ఇంట్రో సాంగ్ ఇంకా ఫైట్ సీక్వెన్స్ కి పెట్టి, మంచి పాప్ మ్యూజిక్ ఆడ్ చేయడం సూపర్ గా ఉంది!
నిన్న శేష్ బర్త్‌డే సందర్భంగా, ‘డకాయిట్ ’ నుంచి టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈరోజు ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, మేకర్స్ అధికారికంగా టీజర్‌ను రిలీజ్ చేశారు.
టీజర్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది – డాకోయిట్ అనేది ప్రేమ (Love) ఇంకా నేరం (Crime) అనే opposite sides ని బలంగా కలిపే కథ అని. ఈ టీజర్లో మనకు కనిపించే సీన్స్ చాలా హై-స్టేక్స్తో ఉన్నాయ్.
ఒక పెద్ద దోపిడీని ప్లాన్ చేసే హీరో, తన ఎక్స్‌తో కలిసి “ఇది చివరి పని” అన్నట్టుగా ఒక ప్రమాదకరమైన మిషన్‌కు సిద్ధమవుతాడు. ఈ టీజర్లో అడవి శేష్ తన నటనలోని మరో కోణాన్ని చూపించాడు. జైల్లో ఉన్నప్పటికీ, పెద్ద ప్లాన్‌తో ముందుకు సాగుతున్న ఒక తెలివైన కాన్‌మ్యాన్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ముఖ్యంగా మదనపల్లె యాసలో ఆయన డైలాగ్ డెలివరీ పాత్రకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది. ఈ పాత్ర ప్రేక్షకులను వెంటనే కనెక్ట్ చేస్తుంది.
మృణాల్ ఠాకూర్ కూడా ఏమాత్రం తగ్గకుండా నటించింది. ప్రేమ, బాధ, కోల్పోయిన అనుబంధాల నుంచి పుట్టిన భావోద్వేగాలతో ఆమె పాత్ర చాలా బలంగా కనిపిస్తుంది. అడవి శేష్ – మృణాల్ మధ్య ఉన్న ఎమోషనల్ అండర్‌కరెంట్ టీజర్‌కే బాగా హైలైట్ అవుతుంది.
కాస్టింగ్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్త తీసుకున్నారు. అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి, ప్రకాశ్ రాజ్, సునీల్ లాంటి విభిన్నమైన నటులు సినిమాకు ప్రత్యేకమైన వెయిట్ తీసుకొస్తున్నారు. ప్రతి పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతోందన్న ఫీల్ టీజర్ నుంచే వస్తోంది.’
దర్శకుడు షానియల్ డియో టీజర్‌ను చాలా ఇంట్రిగ్యూయింగ్గా కట్ చేశారు. అసలు కథ ఏంటి? అడవి శేష్ పాత్ర నిజంగా ఎవరు? అన్న ప్రశ్నలు ప్రేక్షకుల మనసుల్లో మిగిలేలా టీజర్ రూపొందించారు. సినిమాటోగ్రాఫర్ దనుష్ భాస్కర్ విజువల్స్ టీజర్‌కు పెద్ద ప్లస్. డస్టీ కలర్ ప్యాలెట్, రఫ్ యాక్షన్ సీన్స్, స్టైలిష్ ఫ్రేమ్స్ టెన్షన్‌ను మరింత పెంచాయి. గ్యాని అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా ఐకానిక్ ‘కన్నె పిట్టరో’ రీమిక్స్, ప్రతి ఫ్రేమ్‌కు ఎనర్జీని నింపింది.
మొత్తానికి, డాకోయిట్ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ప్రేమ, నేరం, భావోద్వేగాలు, హై-వోల్టేజ్ డ్రామా—all-in-one ప్యాకేజ్‌గా ఈ సినిమా ఉండబోతుందనే నమ్మకం కలుగుతోంది. ఈ చిత్రం ఉగాది సందర్భంగా, మార్చి 19న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.