సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఆల్రెడీ మహేష్ బాబు సూపర్ స్టార్ గా టాలీవుడ్ ని ఏలుతున్నాడు… ఇక ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి కూడా టైం వచ్చింది… కృష్ణ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మంజుల కూతురు జాన్వీ స్వరూప్ రెడీ గా ఉంది. తను ఒక జ్యూవెలరీ యాడ్ లో మెరిసి అందరిని ఆశ్చర్య పరిచింది!
ఇక నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ ఇప్పుడు హీరో గా పరిచయం కాబోతున్నాడు. తన ఫస్ట్ సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ RX 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్నాడు.
ఐతే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అంట… ఈ న్యూస్ ని మేకర్స్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసారంట…
ఈ సినిమా ని ఆనంది ఆర్ట్స్, వైజయంతి మూవీస్ ఇంకా CK పిక్చర్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.