14 Reels Plus ఇంకా Eros మధ్య ఉన్న ఆర్థిక సమస్యల కారణంగా డిసెంబర్ 5కి ప్లాన్ చేసిన బాలయ్య అఖండ 2 సినిమా విడుదల లాస్ట్ మినిట్ లో ఆగిపోయింది. కొర్ట్ కేసు కూడా పెండింగ్ లో ఉండటంతో, బాలయ్య అభిమానులు పూర్తిగా నిరాశకు గురయ్యారు. ఇది అసలు ఎవరు expect చేయలేదు అందుకే చాల చాల డిస్స్పాయింట్ అయ్యారు. అసలు ఏమి జరిగింది అని తెలుసుకోవడానికి నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది…

సో, మొత్తం టాలీవుడ్ పెద్ద నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు ఇలా అందరు సపోర్ట్ చేయడం తో నిన్నటినుంచే పరిస్థితులు మారడం మొదలయ్యాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయ్యాయని వచ్చిన రూమర్స్ కి ఇవాళ మరింత బలమైన అప్డేట్ వచ్చేసింది. మద్రాస్ హై కోర్ట్ ‘అఖండ 2’ రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది!
అందుకే, సినిమాను డిసెంబర్ 12న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
సాయంత్రం వరకు మేకర్స్ నుండి కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల అనుమతితో పెయిడ్ ప్రేమియర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వార్తతో బాలయ్య అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు!
ఓవర్సీస్ లో పెద్దగా రిలీజ్ దొరకకపోయినా… బలయ్య–బోయపాటి కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ మాత్రం వేరే లెవెల్. డొమెస్టిక్ మార్కెట్ లో భారీ ఓపెనింగ్స్ తెచ్చే శక్తి ఈ కాంబోకే ఉంది.