మాస్ అప్పీల్ కి మారు పేరు బాలయ్య… ఇక మన బాలయ్య బోయపాటి తోని కలిస్తే వచ్చే సౌండ్ అదుర్స్ అని తెలుసు కదా. అది కూడా బ్లాక్బస్టర్ హిట్ సినిమా అఖండ కి సీక్వెల్ అంటే ఇంకా ఆ సౌండ్ ఏ లెవెల్ లో ఉంటుందో ఊహించుకోండి.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ తోనే అభిమానుల ఊహలకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన ‘అఖండ 2: బ్లాస్టింగ్ రోర్’ టీజర్ అయితే అభిమానుల రక్తం మరిగించేలా ఉంది!
టీజర్‌లో బాలయ్య రెండవ పాత్రలో దూసుకొచ్చే తీరు అసలే తుఫాన్‌లా ఉంది. అగ్నిలాంటి డైలాగులు, ఉరిమే యాక్షన్ – అన్నీ కలిపి ఒక్క మాస్ విందు లాంటివి.
అందులో ఆయన చెబుతున్న లైన్ —
“Sound control lo pettuko… Ye sound ki navvuthano, ye sound ki narukuthano nake theliyadu kodakaa… Oohaku kooda andadu!”
అన్న మాట… థియేటర్లలో కుర్చీలు ఎగిరేలా చేసే స్థాయిలో ఉంది.
రామ్-లక్ష్మణ్ మాస్టర్‌లు డిజైన్ చేసిన హై వోల్టేజ్ ఫైట్స్, ఎస్. థమన్ అందించిన బ్లాస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రతి ఫ్రేమ్ కి ఎపిక్ రేంజ్ వచ్చింది.
ఇక ఈ టీజర్ తో అఖండ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సో, డిసెంబర్ 5 న అఖండ 2: తాండవం థియేటర్లలో మాస్ తుఫాన్ లా ఎంట్రీ ఇవ్వబోతోంది!