Native Async

అనురాధ సమర్పణలో అభిరామ్ చిత్రం

Anuradha Devi Presents Abhiram’s New Love Thriller Film Officially Launched in Hyderabad
Spread the love

శ్రీమతి అనురాధ దేవి సమర్పణలో శ్రీ సాయి శోభనాచల పిక్చర్స్ తొలి చిత్రం షూటింగ్ విజయదశమి రోజు హైదరాబాద్ లో నిరాడంబరంగా ప్రారంభమయ్యింది.

ఫిలింనగర్ లోని సంస్థ కార్యాలయంలో దేవుడి పై తీసిన ముహూర్తపు షాట్ కు కళారత్న భగీరథ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, హీరో అభిరామ్ క్లాప్ ఇచ్చారు, సినిమా స్క్రిప్టును సమర్పకురాలు ఎన్. ఆర్. అనురాధాదేవి అందించారు.

పూజ కార్యక్రమాన్ని ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దీపావళి తరువాత మొదలవుతుందని నిర్మాత అభిరామ్ రెడ్డి దాసరి చెప్పారు.
ఈ సినిమా లవ్, థ్రిల్లర్ గా రూపొందుతుందని, ఈ తరానికి నచ్చే కథ తో నిర్మిస్తున్నామని, త్వరలోనే మిగతా నటీనటులను ఎంపిక చేస్తామని చెప్పారు.

ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అభిరామ్ రెడ్డి దాసరి, ఛాయాగ్రహణం: విజయ భాస్కర్ సద్దాల, సహ దర్శకుడు: సాయి, సంగీతం: మంత్ర ఆనంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నారాయణ రాజు ఎస్. బి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు, నిర్మాత: అభిరామ్ రెడ్డి దాసరి.

ఇంకా పేరు నిర్ణయించని ఈ ప్రేమ కథా చిత్రాన్ని సీనియర్ నిర్మాత శ్రీమతి అనురాధా దేవి సమర్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *