Native Async

అవతార్ ౩ ప్రీమియర్ రివ్యూ టాక్…

Avatar 3: Fire and Ash Opens to Mixed Reviews After Early Premieres
Spread the love

ప్రపంచ సినిమా చరిత్రలో లెజెండరీ దర్శకుల్లో ఒకరైన జేమ్స్ కామెరూన్ రూపొందిన సినిమా అవతార్ 3 – ఫైర్ అండ్ ఆష్. ఈ చిత్రం డిసెంబర్ 19న భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

అధికారిక విడుదలకు ఈ సినిమాకు ఎర్లీ ప్రీమియర్స్ నిర్వహించారు. అయితే, ఆ ప్రీమియర్స్ నుంచి వస్తున్న వార్తలు అవతార్ అభిమానులకు అంతగా ఊరటనిచ్చేవిగా లేవు. హాలీవుడ్‌కు చెందిన పలు ప్రముఖ మీడియా సంస్థలు ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు ఇచ్చాయి.

కొంతమంది విమర్శకులు జేమ్స్ కామెరూన్ విజన్‌ను ప్రశంసిస్తూ సినిమాకు మంచి రేటింగ్స్ ఇచ్చినప్పటికీ, ఎక్కువమంది అభిప్రాయం మాత్రం అంత సానుకూలంగా లేదు. చాలామంది ఈ సినిమాను “ఇమాజినేటివ్‌గా కన్నా, అలసట కలిగించేలా ఉంది” అని వ్యాఖ్యానించారు.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే… అవతార్ సిరీస్‌లోని ఈ మూడో భాగానికి, మొదటి రెండు భాగాల స్థాయిలో హైప్‌, అంచనాలు కనిపించలేదు. అందుకే ఈ సినిమాకు బాక్సాఫీస్‌లో నిలబడాలంటే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, బలమైన రివ్యూలు చాలా అవసరం అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit