జేమ్స్ కామెరూన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అవతార్ థర్డ్ పార్ట్ త్వరలో రిలీజ్ అవ్వబోతోంది… అందుకే ఇందాకే నిర్మాతలు కొత్త ట్రైలర్ అవతార్: ఫైర్ అండ్ ఆష్ తాజాగా సోషల్ మీడియా లో విడుదల చేసారు. రిలీజ్ అయినా కొన్ని నిమిషాల్లోనే ట్రైలర్ ఇప్పటికే అభిమానుల వద్ద సానుకూల స్పందన తెచ్చుకుంటోంది. ఈసారి పాండోరా ప్రపంచంలోని జలరాజ్యాన్ని మరింత అందంగా, విభిన్నంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆ అద్భుతమైన లోకంలోకి తీసుకెళ్తోంది.
ట్రైలర్ ప్రకారం కథ మళ్లీ జేక్ సల్లి, యోధురాలు నెయిటిరి ఇంకా వారి కుటుంబం కొత్త ప్రమాదాలను ఎదుర్కొనే విధంగా సాగుతుంది. గత భాగంలానే ఈసారి కూడా కథనం సింపుల్‌గానే ఉంటుందని అనిపిస్తున్నా, ట్రైలర్‌లో చూపించిన విజువల్స్ మైమరిపించేలా ఉన్నాయి. అదే సమయంలో భావోద్వేగాల లోతు కూడా బలంగా కనిపిస్తోంది.
జేమ్స్ కామెరూన్, రిక్ జాఫ్ఫా, అమాండా సిల్వర్ రాసిన ఈ చిత్రంలో సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్‌స్లెట్, ఊనా చాప్లిన్, క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూర్, సీసీహెచ్ పౌండర్, ఎడీ ఫాల్కో, డేవిడ్ థ్యూలిస్, జెమైన్ క్లెమెంట్, జియోవన్నీ రిబిసీ తదితరులు నటిస్తున్నారు.
ఈ మహత్తర విజువల్ వండర్ డిసెంబర్ 19, 2025న ఐమాక్స్ 3డీ, డాల్బీ సినిమా, రియల్ డీ 3డీ, 4డిఎక్స్, స్క్రీన్ ఎక్స్ లాంటి పలు ఫార్మాట్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.