ఎస్.ఎస్. రాజమౌళి మాస్టర్‌పీస్ బాహుబలి మళ్లీ థియేటర్లలోకి వస్తున్నా సంగతి తెలిసిందే. ఈసారి రెండు పార్ట్స్‌ను ఒకే ఫార్మాట్‌లో కట్ చేసి Baahubali: The Epic అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. రీ-రిలీజ్ అయినా కూడా సినిమా మీద ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పటిలానే విపరీతంగా ఉంది. థియేటర్లలో రీ-రిలీజ్‌లకు కొత్త రికార్డులు సృష్టించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటికే అమెరికాలో బాహుబలి: ది ఎపిక్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మొదటి కొన్ని గంటల్లోనే భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడైపోయాయి. మొత్తం 3,001 టికెట్లు విక్రయమవ్వగా, $60,603 (దాదాపు ₹50 లక్షలు) గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. మొత్తం 107 లొకేషన్స్‌లో, 107 షోలకు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

ఇంకా ప్రీమియర్‌కి 14 రోజులు టైమ్ ఉండటంతో, ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మరింతగా పెరగనుందని అంచనా. అమెరికన్ ఆడియెన్స్ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు మేకర్స్ స్పెషల్ పాస్‌లను కూడా ఎనేబుల్ చేశారు. దాంతో ఇక నుంచి టికెట్ సేల్స్ మరింత వేగం పుంజుకోనున్నాయి.

ట్రేడ్ అనలిస్టులు, ఫ్యాన్స్ అందరూ ఒకే మాట చెబుతున్నారు — బాహుబలి తన టైమ్‌లో కొత్త సినిమాలకే కాదు, ఇప్పుడు రీ-రిలీజ్‌లకూ రికార్డులు సృష్టిస్తుందని. రాజమౌళి విజన్‌తో, ప్రభాస్ శౌర్యంతో, Baahubali: The Epic మరోసారి ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. అక్టోబర్ 31న గ్లోబల్ రిలీజ్ కాగా, అమెరికాలో అక్టోబర్ 29న ప్రీమియర్స్ జరగనున్నాయి.