సండే రోజున ఎలిమినేషన్ లేదు అని బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే హౌస్ లో సైలెంట్ గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. అసలు దివ్య వెళ్లిపోవాల్సింది… కాని ఇమ్మాన్యుయేల్ ‘పవర్ ఆస్త్ర’ వాడి ఆమెకు రెండో ఛాన్స్ ఇచ్చాడు… అనుకోని ట్విస్ట్ కదా!
కానీ… monday రోజు నామినేషన్స్ టైమ్ లో రెండు పెద్ద గొడవలు హౌస్ ని మంటలు పెట్టించాయి.
సంజన – రితు మధ్య సంచలన వ్యాఖ్యలు:

ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయ్యే సంజన, ఈ సారి రితు మీద చాలా షాకింగ్ కామెంట్స్ చేసింది.
“రాత్రి డెమన్ పవన్ తో ఏం చేస్తావో అందరికీ తెలుసు… అతని పక్కనే కూర్చొని ఏం చేస్తేనా నేను కన్నులతో చూడలేను… నాకు ఇష్టం లేదు!” అంటూ క్యారెక్టర్ అసాసినేషన్ లాంటి మాటలు బయటపెట్టింది.
ఈ మాటలు వింటూనే హౌస్ అంతా అలర్ట్ అయ్యింది. అందరూ సంజన దగ్గరకు వెళ్లి మాట వెనక్కి తీసుకోమని రిక్వెస్ట్ చేశారు… కానీ సంజన సింగిల్ స్టాండ్ మీద నిలిచిపోయింది.
రితు కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది… మిగతా వారంతా సైలెంట్ గా చూడలేక డిస్కషన్ లోకి జంప్ అయ్యారు.
డెమన్ – ఇమ్మాన్యుయేల్ – కళ్యాణ్ వైపు సెకండ్ బిగ్ ఫైట్:
అదే నామినేషన్స్ లో డెమన్, ఇమ్మాన్యుయేల్ ని నామినేట్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు పాత టాస్క్ విషయాలు బయటకీ వచ్చాయి. రితు డెమన్ కి సపోర్ట్ గా నిలవడంతో కళ్యాణ్ కూడా ఆ సంభాషణలోకి జంప్ అయ్యాడు.
మాట మాటకి తూటాలు పేలాయి…
కల్యాణ్ మాట్లాడుతూ: “డెమన్ తన ఆట ఆడటం లేదు… స్టాండ్ తీసుకోవడం లేదు… సెల్ఫిష్ గేమ్ ఆడుతున్నాడు” అన్నాడు.
హౌస్ మేట్స్ అందరూ వచ్చి వారిని కూల్ చేయాల్సి వచ్చింది.
ఇంత పెద్ద కాంట్రవర్సీ జరగడంతో ఈ వీకెండ్ నాగార్జున ఖచ్చితంగా దీనిపై మాట్లాడే ఛాన్స్ ఎక్కువ. సంజనకి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చే అవకాశం కూడా ఉంది.
ఇది బిగ్ బాస్… ఇక్కడ ఒక్క మాట కూడా హౌస్ ని మంటలు పెట్టగలదు! రెడ్ కార్డు వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు… మరి మాటలు అన్న సంజన కా లేకపోతె గొంతు పట్టుకున్న డెమోన్ కా??? చూద్దాం…