మనం తెలుగు ప్రేక్షకులం ఎంతగానో ఎదురుచూస్తున్నా తెలుగు బిగ్ బాస్ సీజన్లో 9 ఎంతో అట్టహాసంగా నిన్న రాత్రి మొదలైపోయింది… ఈరోజు వాళ్ళ మొదటి రోజు కాబట్టి, అంత హడావిడి ఏమి లేదు కానీ అందరు ఒకరితో ఒకరు పరిచయాలు పెంచుకున్నారు…
ఇక టాస్క్స్ విషయానికి వస్తే, మొదటి రోజే నాగార్జున అగ్ని పరీక్షా లో గెలిచి వచ్చిన వాళ్ళు ఓనర్స్ అని సెలబ్రిటీస్ tenants అని చెప్పి ఇద్దరినీ రెండు ఇళ్లల్లో ఉంచాడు. సో, ఈరోజు పొద్దున్న ఎవరి డ్యూటీస్ వాళ్ళు పంచుకుని పనులు చేసారు.
ఐతే HARISH ఎందుకో ఏడ్చాడు… శ్రీజ మాత్రం ఎవ్వరిని నమ్మద్దు నేను నమ్మను అని గట్టిగ తన వాళ్ళకి చెప్పింది. ఇక సెలబ్రిటీస్ బ్యాచ్ లో భరణి అందరిని పరిచయం చేసుకుని, వాళ్ళ గురించే చెప్తూ, మంచి గా అందరికి క్లోజ్ అయ్యాడు.
ఇక మళ్ళి ఒకసారి ఇంటిలోకి వెళ్లిన వాళ్ళ పేర్లు మీకోసం:
కామన్ పీపుల్:
దమ్ము శ్రీజ
సోల్జర్ పవన్ కళ్యాణ్
డెమోన్ పవన్
మాస్క్ మాన్ హరీష్
మర్యాద మనీష్
సెలబ్రిటీస్:
సీరియల్ యాక్టర్ భరణి
సీరియల్ యాక్టర్ తనూజ
జబర్దస్త్ ఇమ్మానుయేల్
కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ
లక్స్ పాపా సాంగ్ ఫేమ్ ఆశ షైనీ
హీరోయిన్ సంజన గల్రాని
ఫోక్ సింగర్ రాము రాథోడ్
సీరియల్ యాక్ట్రెస్ రైతు చౌదరి
యాక్టర్ సుమన్ శెట్టి