బిగ్ బాస్ తెలుగు సీజన్ 9… రెడీ గా ఉండండి అంత సిద్ధం లాంచ్ కి! సరిగ్గా ఈరోజు రాత్రి 7 గంటలకి TV లకి అతుక్కుపోవాల్సిందే కదా… ఆల్రెడీ మనం బిగ్ బాస్ అగ్ని పరీక్షా రియాలిటీ షో చూసాం… దాంట్లో మొదట 40 మందిలో 15 మెంబెర్స్ ని సెలెక్ట్ చేసి ఆ తరువాత 13 మెంబెర్స్ ని షో లాంచ్ డే కి రెడీ చేసారు. మరి ఎంత మంది ఈరోజు హౌస్ లోకి వెళ్తారో చూడాలి…
ఐతే అందరు చక్కగా నాగార్జున తో మాట్లాడుతున్న ప్రోమో అదిరిపోయింది… ఈ ప్రోమో మనకి నాగార్జున రెండు హౌసెస్ చూపించి చూపించినట్టు గా చేసాడు… అలానే ప్రోమో లో “లక్స్ పాపా…” సాంగ్ ఫేమ్ ఆశ షైనీ ఐతే పర్ఫెక్ట్ గా హౌస్ లోకి వెళ్తున్నట్టు కనిపించింది… ఇక ఒక కంటెస్టెంట్ ఒక బాక్స్ ని చేతిలో పట్టుకుని వచ్చి, ఇది హౌస్ లో నాతోనే ఉండాలి అంటాడు… కానీ బిగ్ బాస్ అందుకు ఒప్పుకోడు. సో, అతను తిరిగి ఇంటికి వెళ్లినట్టు చూపించారు. మరి ఆ కంటెస్టెంట్ ఎవరో… అలాగే ఈ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ చూసాం… అలాగే నాగార్జున కళ్ళకు గంతలు కట్టుకుని ఇంటిలోకి ప్రవేశించగా… “ఇప్పటివరకూ నాలో యుద్ధ భూమిలో శంఖం పూరించే కృష్ణున్ని చూశారు. ఈ సీజన్‌లో రంగంలోకి దిగే అర్జునున్ని చూస్తారు.’ అంటూ బిగ్ బాస్ చెప్పగా… ‘నేను దేనికైనా సిద్ధమే’ అంటూ నాగార్జున అనడం సూపర్ గా ఉంది!
సో, ఇప్పటి వరకు మాకున్న సమాచారం ప్రకారం సెలబ్రిటీస్ లో 9 మెంబెర్స్ అంటే యాంకర్, టీవీ నటి రీతూ చౌదరి, జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, డ్యాన్సర్ రాము రాథోడ్, బుజ్జిగాడు ఫేం సంజనా గల్రానీ, ఆషా షైనీ, భరణి శంకర్, సుమన్ శెట్టి, కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ, అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ ఎంటర్ అవుతారు, ఇంకా అగ్ని పరీక్షా లోంచి కామనర్స్‌గా దమ్ము శ్రీజ, పవన్ కల్యాణ్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్ వెళ్లే ఛాన్స్ ఉంది. ఇంకా వేళ్ళు అందరు కలిసి 14 మెంబెర్స్ ఐతే, ఇంకో 3-4 మెంబెర్స్ ని వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా పంపే ఛాన్స్ ఉంది. చూద్దాం ఎం జరుగుతుందో…
బిగ్ బాస్ 9 తెలుగు లాంచ్ UPDATES కోసం చూస్తూనే ఉండండి నేటిప్రపంచం…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి అంతా సిద్ధం
Spread the love