తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పై చర్చ మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో టికెట్ రేట్లు రీ–వైజ్ చేస్తూనే ఉన్నా… పెద్ద సినిమాలు వస్తే నిర్మాతలు స్పెషల్ హైక్స్ కోరడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఫస్ట్ వీక్, మొదటి పది రోజులు టికెట్ రేట్లు చాలా ఎక్కువగానే ఉండటంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బెనిఫిట్ షోలు, ప్రీమియం ప్రైసింగ్ ఇప్పుడు సహజమే అయిపోయాయి. కానీ “ఇవన్నీ ఇండస్ట్రీకి ఉపయోగం కాకపోయినా, పబ్లిక్‌కి మాత్రం గొడవే ఎక్కువ” అని చాలామంది భావిస్తున్నారు.
ఇక నిర్మాతల మాట వేరే…
“మాకు టికెట్ రేట్లలో నిజంగా చాలా చిన్న షేర్ మాత్రమే వస్తుంది… పబ్లిక్‌కు అసలు లెక్క తెలియదు” అని వారు చెబుతుంటారు. అందుకే ఈ వివాదంపై నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. టికెట్ మొత్తాల్లో నిర్మాత దగ్గరికి ఎంత వస్తుందో చాలా క్లియర్‌గా వివరించారు.

100 రూపాయల టికెట్‌లో నిర్మాతకి కేవలం 28 రూపాయలు మాత్రమే:
బన్నీ వాస్ చెప్పినదాని ప్రకారం, 100 రూపాయల టికెట్‌లో కేవలం 28% మాత్రమే నిర్మాతకు చేరుతుందని అన్నారు.
మిగతావన్నీ:
- థియేటర్ షేర్
- పన్నులు
- డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు
అన్నీ కలిపి వెళ్లిపోతాయి.
అంతేకాదు…
ఆ 28 రూపాయిల్లో కూడా కొంచెం మిగిలిన లాభం మీద మళ్లీ 35%–40% ఇన్‌కమ్ ట్యాక్స్ పడుతుందని చెప్పారు. అంటే నిర్మాత చేతిలో మిగిలేది ఇంకా తగ్గిపోతుంది.
కాబట్టి “600, 800 రూపాయల టికెట్ అన్నాక… పబ్లిక్ మేం అన్నీ దోచేస్తున్నామని అనుకుంటారు అని అన్నారు బన్నీ వాస్!
ప్రీమియం షోలు, బెనిఫిట్ షోల్లో భారీ ధరలు పెట్టినప్పుడు “అక్కడ మొత్తం డబ్బు నిర్మాతకే వస్తుంది” అనే భ్రమ పబ్లిక్‌లో ఉందని చెప్పారు. కానీ వాస్తవానికి నిర్మాతకు వచ్చే భాగం చాలా తక్కువేనని… ఈ విషయాన్ని మీడియా ప్రజలకు అర్థం చేయాలని కూడా కోరారు.