మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమా మీద అంచనాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ “మీసాల పిల్లా” ఇప్పటికే వైరల్ అయి అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. ఆ సాంగ్‌కి వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. చిరు డాన్స్, స్వాగ్ అబ్బో చూసి తీరాలి! అలానే నయన్ కూడా అబ్బో అనిపించింది!
ఇక ఈరోజు దీపావళి సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో చిరంజీవి లుక్ సింపుల్‌గా ఉన్నా స్టైలిష్‌గా, క్లాసీగా ఉంది. సూట్, వైట్ టీషర్ట్ కాంబినేషన్‌తో చిరు ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఆయనతో పాటు ఇద్దరు స్కూల్ కిడ్స్ సైకిల్ తొక్కుతూ కనిపించడం పోస్టర్‌కి మరింత ఫెస్టివ్ టచ్ ఇచ్చింది.
లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ భారీ అంచనాల నడుమ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.