సంక్రాంతి పండుగ సీజన్‌ను మరింత గ్రాండ్‌గా మార్చేందుకు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా రెడీ గా ఉంది. ఈ సినిమాలో కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపిస్తున్నట్టు తెలిసిందే కదా. అయన పాత్ర ఆల్మోస్ట్ 20 నిమిషాల వరకు ఉంటుందని దర్శకుడు అనిల్ చెప్పాడు కూడా. ఐతే ఈ చిత్రం జనవరి 12న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. లేటెస్ట్ గా డైరెక్టర్ అనిల్ హైప్ మీటర్‌ను మరింత పెంచుతూ, వెంకీ చిరు కలిసి స్టెప్ వేసిన సాంగ్ ప్రోమో రిలీజ్ చేసాడు.
ఇప్పటికే విడుదలైన తొలి రెండు పాటలు మ్యూజిక్ చార్ట్స్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మేకర్స్ మూడో సింగిల్‌కు సంబంధించిన ప్రమోను విడుదల చేశారు, ఇందులో ఓ స్పెషల్ ఏంటంటే ఫస్ట్చి టైం చిరు – వెంకటేష్ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాస్ బీట్‌లు, ఎనర్జీతో నిండిన డ్యాన్స్ నంబర్‌ను అందించినట్లు సమాచారం.
ఈ ప్రమోలో చిరు, వెంకీ ఇద్దరూ లైవ్లీ పబ్ బ్యాక్‌డ్రాప్‌లో స్టైలిష్‌గా ఎంట్రీ ఇవ్వడం అభిమానులను ఫిదా చేస్తోంది. ఇద్దరూ కూల్ షేడ్స్ వేసుకుని కనిపించే మూమెంట్ అయితే అసలైన హైలైట్‌గా నిలిచింది. ఇక “Turn up the music and pop up the sound” అనే లైన్ వినిపించిన వెంటనే విజిల్స్ పడేలా చేసే పవర్ ఈ ప్రమోకు ఉంది.
ఫుల్ సాంగ్ ఇంకో రెండు రోజుల్లో అంటే 30th డిసెంబర్ న రిలీజ్ అవుతుంది!