పవన్ కళ్యాణ్ ‘ఓజి’ తర్వాత విడుదలైన ఏ ప్రధాన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద గట్టి ప్రభావం చూపలేకపోయింది. ఇతర భాషల సినిమాలైన ‘కాంతార చాప్టర్ 1’, ‘ధురంధర్’ లాంటి చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ, భారీ అంచనాల మధ్య విడుదలైన బాలకృష్ణ ‘అఖండ 2’ మాత్రం ట్రేడ్ ఆశించిన స్థాయికి కొద్దిగా తక్కువగా నిలిచింది.
2025 ముగింపుకు చేరుకుంటున్న ఈ సమయంలో, క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదలకానున్న సినిమాలపై టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. డిసెంబర్ 25న డబ్బింగ్ సినిమాలతో కలిపి మొత్తం ఏడు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. క్రిస్మస్ వీకెండ్‌తో పాటు న్యూ ఇయర్ వరకు వచ్చే వరకు ఈ సినిమాలకు మంచి అవకాశంగా మారనున్నాయి.
ఈ వారం విడుదలవుతున్న చిత్రాల్లో ‘చాంపియన్’, ‘శంభాల’, ‘పతంగ్’, ‘ధండోరా’, ‘ఈశ’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వీటితో పాటు ఇతర భాషల నుంచి డబ్బింగ్ రూపంలో వస్తున్న ‘వృషభ’ ఇంకా ‘మార్క్’ కూడా పోటీలో ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏదైనా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే, సంక్రాంతి సీజన్ వరకు ఉన్న రెండు వారాల రన్లో మంచి లాభాలు సాధించే అవకాశం ఉంది.
ఈ విడుదలల్లో ముఖ్యంగా రోషన్ మేక నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘చాంపియన్’ ఇంకా ఆది నటించిన మైథికల్ థ్రిల్లర్ ‘శంభాల’పై బలమైన బజ్ కనిపిస్తోంది. వీటి ప్రీ-రిలీజ్ ప్రమోషన్స్, టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. చిన్న సినిమాలైన ‘ఈశ’, ‘పతంగ్’, ‘ధండోరా’ కూడా తమ కంటెంట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగాయి.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఫాంటసీ డ్రామా ‘వృషభ’ విజువల్‌గా ఆకట్టుకునే ట్రైలర్లతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. అలాగే తెలుగులో ఇప్పటికే మంచి గుర్తింపు ఉన్న కన్నడ స్టార్ సుదీప్ నటించిన యాక్షన్ కాప్ డ్రామా ‘మార్క్’ ప్రేక్షకులకు యాక్షన్ విందు అందించనుంది. చూద్దాం ఈ సినిమా హిట్ అవుతుందో…