తెలుగు సినిమాల్లో కమెడియన్స్ హీరోలుగా మారడం కొత్త కాదు. బ్రహ్మానందం నుంచి వేణు, వెన్నెల కిషోర్ వరకు పలువురు కనెడియన్స్ తమ టాలెంట్‌తో హీరో అయ్యారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో పేరు చేరబోతోంది — సత్య.
ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న కమెడియన్ సత్య తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అతని టైమింగ్, స్క్రీన్‌పై ప్రెజెన్స్, చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తుంది.

సత్యకు పెద్ద గుర్తింపు తెచ్చినది ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీ. సింహా కొడూరి హీరోగా, రీతేష్ రాణా దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్‌లో సత్య స్క్రీన్ టైమ్, హాస్యం, నటన సూపర్. ఇప్పుడు మళ్ళి రీతేష్ రాణా, సత్య — మళ్లీ చేతులు కలిపారు.

ఇద్దరూ కలిసి చేస్తున్న కొత్త సినిమా రీతేష్ రాణా స్టైల్‌కు తగ్గ మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోందని టాక్. ఈ సారి సత్య ఫుల్-ఫ్లెడ్జ్డ్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌కు ప్రొడ్యూస్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన మాత్రం త్వరలో రానుంది.
ఇక ప్రొఫెషనల్‌గా చూస్తే సత్య చాలా బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ రాబోయే చిత్రం పెద్ది లో కీలక పాత్రతో పాటు, మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తున్నాడు.