మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు గురించి తెలుసు కదా… మంచి హీరో… ఐతే ఇప్పుడు అతని చిన్న కొడుకు దర్శన్ కూడా తనదైన విధంగా సినిమా ప్రపంచంలో పేరుతెచ్చుకునేందుకు అడుగులు వేస్తున్నాడు. చిన్నారిగా రెండు మూడు సినిమాల్లో కనిపించిన దర్శన్… ఇప్పుడు పెద్ద అవకాశం చేజిక్కించుకున్నాడు!
ఎస్.ఎస్. రాజమౌళి – మహేశ్ బాబు – వరణాసి అనే భారీ కాంబినేషన్‌లో… మహేశ్ బాబు చిన్ననాటి పాత్ర కోసం దర్శన్‌ను ఫిక్స్ చేశారని ఇండస్ట్రీలో టాక్. త్వరలోనే ఈ చిన్నతనం ఎపిసోడ్ షూట్ స్టార్ట్ అవుతుందట. గౌతమ్ ఈ రోల్ చేస్తాడని ఫ్యాన్స్ ముందుగా ఆశించినా… ప్రస్తుతం వయసు కూడా సెట్ కావడం లేదు, ఆయన అవైలబిలిటీ కూడా లేదట. పైగా, దర్శన్ లుక్ మాత్రం ఈ సినిమాలోని మహేశ్ కి మ్యాచ్ అవుతోంది అంట… ప్రత్యేకంగా ఆ హెయిర్ స్టైల్ కారణంగా. ‘మామ–అల్లుడు’ మ్యాజిక్ ఈసారి స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అవుతుందనే నమ్మకం టీమ్‌లో కనిపిస్తోంది.
ఇంతకుముందు ప్రభాస్ చిన్ననాటి పాత్ర కూడా ఫౌజీ సినిమాలో దర్శన్ పోషించాడు. ఇప్పుడు వరణాసి కూడా అతని ఖాతాలో చేరుతోంది. ఇవి రెండూ హిట్ అయితే… దర్శన్ కెరీర్‌లో చాలా బలమైన అడుగులు పడినట్టే.
దుర్గ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ 2027లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.