Native Async

వామ్మో లోకేష్ కానగరాజ్ కూడా సమర్దించాడేంటి???

Deepika Padukone Exits Kalki 2898 AD Sequel | Reason Behind Her Exit Revealed
Spread the love

రజినీకాంత్ కూలీ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ గురించి ఎం మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా??? అయన దేన్నీ సమర్దించాడు???

వస్తున్నాం వస్తున్నాం అక్కడికే వస్తున్నాం…

ఈరోజు పొద్దున్నే నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ బ్యానర్ సినిమా కల్కి 2898 AD నుంచి దీపికా పాడుకొనే తప్పుకుంది అని అధికారికంగా ప్రకటించారు కదా… ఈ న్యూస్ ఇంకా జీర్ణించుకోలేదు… అప్పుడే రజినీకాంత్ కూలీ డైరెక్టర్ లోకేష్ కూడా ఆ పోస్ట్ కి రిప్లై ఇస్తూ, ఇది కరెక్ట్ డెసిషన్ అని పోస్ట్ పెట్టాడు.

ఆమ్మో… అసలే నిర్మాతలు ‘కమిట్మెంట్’ వల్ల దీపికా పదుకొనె ఈ సినిమా నుంచి తప్పుకుంది అని చెప్పారు… ఏంటో అసలు మేటర్ ఏంటో దీపికా స్టేట్మెంట్ ఇచ్చే వరకు ఆగాలి!

ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. VFX విజువల్స్, భారీ స్థాయి టెక్నికల్ విలువలు, అద్భుతమైన స్టార్ కాస్ట్ ఈ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్ళాయి. ముఖ్యంగా దీపికా పదుకొనే పాత్ర చాలా ఇంపార్టెంట్‌గా ఉండడంతో, ఆమె సీక్వెల్ లో కూడా ఉండబోతుందనే ఎక్సైట్మెంట్ అభిమానుల్లో ఎక్కువగా ఉంది.

అయితే, తాజాగా వచ్చిన వార్త మాత్రం అందరినీ షాక్ కు గురి చేసింది. కల్కి 2898 AD సీక్వెల్ లో దీపికా పదుకొనే లేరని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంటే షూటింగ్ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం వల్లే ఇరువురి మధ్య అనుకోని విభేదాలు వచ్చాయని సమాచారం.

ఇది మొదటి సారి కాదు. గతంలో ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా సినిమా స్పిరిట్ లోనూ ఆమె పేరు చక్కర్లు కొట్టింది. కానీ ఆ సమయంలో ఎలాంటి అధికారిక అనౌన్స్‌మెంట్ లేకుండానే, వర్కింగ్ అవర్స్ క్లాష్ కారణంగా ఆఫీషియల్ గా భాగం కాలేదని వార్తలు వచ్చాయి. ఆ స్థానంలో త్రుప్తి దిమ్రి ఫిమేల్ లీడ్ గా ఫిక్స్ అయ్యింది.

కానీ కల్కి పరిస్థితి మాత్రం వేరు. ఎందుకంటే దీపికా ఈ ఫిల్మ్ మొదటి భాగంలోనే కీలక పాత్ర పోషించింది. అందుకే ఆమె లేకపోవడం అభిమానులను మరింత కంగారు పెట్టే అంశం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే—ఆమె పాత్రను మరో నటి చేస్తుందా? లేక మొదటి భాగంలోనే ముగిసిపోయిందని చూపిస్తారా? అనే సస్పెన్స్ కొనసాగుతుంది.

దీపికా ఇంకా దీనిపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. కానీ ఆమె భాగస్వామ్యం మొదటి నుంచే ఉన్నందున, అభిమానులు ఆమె స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. మేకర్స్ మాత్రం ఆమెకు భవిష్యత్ ప్రాజెక్ట్స్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ అధికారికంగా గుడ్‌బై చెప్పారు. ఇక అభిమానుల దృష్టి ఇప్పుడు మేకర్స్ ఎవరిని రోప్ ఇన్ చేస్తారన్న దానిపైనే ఉంది.

మొత్తానికి, దీపికా పదుకొనే లేకపోవడం కల్కి 2898 ఏడి సీక్వెల్ కి ఒక పెద్ద మలుపుగా మారింది అనడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *