పాత కాలం సామెతలు గుర్తుండే ఉంటాయి కదా… ఐతే ఇప్పుడు ఈ rhyme కూడా ఒక్కసారి చదవండి…
“ఉడుత పోయి ఎలుక వచ్చే ఢాం ఢాం ఢాం
ఎలుక పోయి పిల్లి వచ్చే ఢాం ఢాం ఢాం
పిల్లి పోయి కుక్క వచ్చే ఢాం ఢాం ఢాం
కుక్క పోయి ఎద్దు వచ్చే ఢాం ఢాం ఢాం
ఎద్దు పోయి ఒంటె వచ్చే ఢాం ఢాం ఢాం
ఒంటె పోయి గుర్రం వచ్చే ఢాం ఢాం ఢాం
గుర్రం పోయి జిరాఫీ వచ్చే ఢాం ఢాం ఢాం
జిరాఫీ పోయి నక్క వచ్చే ఢాం ఢాం ఢాం
నక్క పోయి చిరుత వచ్చే ఢాం ఢాం ఢాం
చిరుత పోయి సింహం వచ్చే ఢాం ఢాం ఢాం
సింహం పోయి ఏనుగు వచ్చే ఢాం ఢాం ఢాం
ఏనుగు పోయి నేను వచ్చే ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం”…
ఏంటి ఇలా ఎదో ఎదో చెప్తున్నాం అనుకుంటున్నారా???
లేదు… లేదు… అసలు విషయం ఏంటంటే, ‘బలగం’ తో పెద్ద హిట్ కొట్టాడు డైరెక్టర్ గా మారిన యాక్టర్ వేణు యెల్దండి… ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యింది అంటే, ఏకంగా ఊర్లలో ప్రొజెక్టర్స్ వేసి మరి సినిమా చూసి, ఫామిలీ లో ఉండే చిన్న చిన్న గొడవల్ని మర్చిపోయి మరి కలిసేంత గా అని చెప్పచు…

అప్పటి నుంచి, వేణు నెక్స్ట్ సినిమా ఏంటబ్బా అని అందరు వెయిటింగ్… ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ తో సినిమా కూడా అనౌన్స్ చేసారు. ఫస్ట్ ఈ సినిమాలో నితిన్ హీరో అన్నారు కానీ ‘రాబిన్ హుడ్’ సినిమా ప్లాప్ అవ్వడం తో అతను పక్కకి తప్పుకున్నాడు… నెక్స్ట్ నాని తో ఈ సినిమా ఉంటుంది అన్నారు… కానీ అది కుదరలేదు. నెక్స్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు, ఆ తరవాత శర్వానంద్ తో సినిమా అనుకున్న కుదరలేదు…

ఇక ఇప్పుడు ఎవ్వరు ఊహించని పేరు తెరపైకి వచ్చింది… మరి ఆ హీరో ఎవరో తెలుసా, ఎన్నో పెద్ద హిట్ సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవి శ్రీ ప్రసాద్’. ఎస్, మీరు విన్నది కరెక్ట్! ఈ సినిమాలో హీరో దేవి శ్రీ ప్రసాద్… అతనికి ఈ సినిమా హీరో గా ఫస్ట్ ప్రాజెక్ట్… అలాగే ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ అంటున్నారు. చూద్దాం… ఏదైనా official కన్ఫర్మేషన్ రావాలి!
ప్రస్తుతానికి దిల్ రాజు బ్యానర్ లో దేవి హీరో గా వేణు తీయబోయే పల్లెటూరి డ్రామా ‘ఎల్లమ్మ’…