రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ డిసెంబర్ 5న విడుదలై అద్భుతమైన బాక్సాఫీస్ ప్రదర్శనతో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. క్లైమాక్స్‌లో ఇచ్చిన క్లిఫ్‌హ్యాంగర్ కారణంగా సీక్వెల్‌పై ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతోంది. రెండో భాగంలో ‘ప్రాజెక్ట్ ధురంధర్’ అనే గూఢచారి మిషన్ కొనసాగింపు గా, ఈసారి మరింత పై స్థాయి డ్రామా ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు.
ఇదిలా ఉండగా, చాలా సీక్వెల్స్‌లా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ధురంధర్ 2ను 2026 మార్చి 19న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ తేదీని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఈద్ పండుగతో పాటు వచ్చే లాంగ్ వీకెండ్‌ను టార్గెట్ చేయడమే.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే… ధురంధర్ 2 కేవలం హిందీకి మాత్రమే పరిమితం కాకుండా, ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకలో హిందీ వెర్షన్‌కు వచ్చిన అద్భుత స్పందనను దృష్టిలో పెట్టుకుని, సీక్వెల్‌ను ఐదు భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారని టాక్.
ఇప్పటికే భారీ హైప్ మోస్తున్న ధురంధర్ 2, ఎర్లీ సమ్మర్ సీజన్‌లో వచ్చే ఇతర సినిమాలకు గట్టి పోటీగా మారే అవకాశముంది. ఈద్ ఫెస్టివల్‌తో పాటు ఆ తరువాతి వారం సమ్మర్ వెకేషన్‌ను క్యాష్ చేసుకోవాలని బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల నుంచి పలు బిగ్ టికెట్ సినిమాలు రెడీ అవుతున్నాయి.
టాక్సిక్, డకాయిట్, పెద్ది, ది ప్యారడైజ్ వంటి పాన్ ఇండియా సినిమాలు కూడా మార్చి నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
దేశభక్తి భావంతో ముడిపడిన కథతో ధురంధర్ ఒక అవుట్ అండ్ అవుట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో, సీక్వెల్‌పై విడుదలకు ముందే ఊహించని స్థాయిలో బజ్ క్రియేట్ అవడం ఖాయం. అంతేకాదు, మొదటి భాగంలాగే ధురంధర్ 2 కూడా పలు వివాదాలకు దారి తీసి, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించే అవకాశముంది. ముఖ్య నగరాల్లో స్క్రీన్ కౌంట్ విషయంలో ఇతర సినిమాలకు ఇది గట్టి సవాల్‌గా మారనుంది.
ఒకవేళ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందుతున్న ధురంధర్ 2 మార్చి 19న ఎలాంటి మార్పులు లేకుండా రిలీజ్ అయితే, ఇతర సినిమాల విడుదల తేదీల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నా ఆశ్చర్యం లేదు.