సాలార్ లో అదరగొట్టాడు… కల్కి లో చంపేశాడు… ఇక ఇప్పుడు మళ్ళి బాహుబలి రి-రిలీజ్ తో చింపేయబోతున్నాడు… ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలుసు కదా! మన డార్లింగ్ ప్రభాస్ గురించే! ఐతే ఈ సినిమాల మధ్యలో సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ గురించి రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది!

ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసా??? కొరియన్ సూపర్ స్టార్ Don Lee (Ma Dong-seok), అంటే మనకు పరిచయం ఉన్న డాన్ లీ, ‘స్పిరిట్’ లో విలన్ పాత్రలో కనిపించనున్నారని!
ఇదిలా ఉండగా, తాజా కొరియన్ మీడియా రిపోర్ట్స్ మాత్రం ఈ వార్తను నిజం చేశాయి. సోర్సెస్ ప్రకారం — డాన్ లీ ఇండియన్ సినిమాల్లో తన డెబ్యూ ప్రభాస్ స్పిరిట్ సినిమాతోనే చేయనున్నాడు. ఆయన ఇటీవల భారతదేశానికి వచ్చినదీ ఈ చిత్రానికి సంబంధించిన చర్చలకే అని కూడా పేర్కొన్నాయి. ముఖ్యంగా ఆయన ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారని వెల్లడించడంతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కొరియన్ మీడియా హౌస్ ‘మూకో’ ఇచ్చిన నివేదికలోని అనువాదం ప్రకారం — “ఈ చిత్రం పేరు స్పిరిట్. దీన్ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాహుబలి స్టార్ ప్రభాస్ ఒక డార్క్ టోన్ డిటెక్టివ్ క్రైమ్ డ్రామాలో నటిస్తున్నారు. ఇందులో డాంగ్-సియోక్ పాత్ర ప్రభాస్ పాత్రకు వ్యతిరేకంగా ఉంటుంది” అని పేర్కొన్నారు.
ఈ రిపోర్ట్ తో ఇప్పుడు అందరి దృష్టి మళ్లీ స్పిరిట్ టీమ్ వైపు మళ్లింది. ఇక నిర్మాతలు డాన్ లీ ఎంట్రీని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి, ప్రకాశ్ రాజ్, వివేక్ ఓబెరాయ్ లు ఇప్పటికే కన్‌ఫర్మ్ అయ్యారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను భద్రకాళి పిక్చర్స్ ఇంకా టి-సిరీస్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.