హిందీ బెల్ట్ లో సినిమాలకి OTT platforms కి ఒక ముఖ్యమైన నియమం ఉంది: హిందీ సినిమాలు తమ థియేట్రికల్ రిలీజ్ ఎనిమిది వారాలు కంప్లీట్ అయిన తరవాతే OTT ప్లాట్‌ఫామ్ లో సినిమా స్ట్రీమ్ అవ్వలాని. దీనికి మెయిన్ కారణం, థియేట్రికల్ మార్కెట్‌ను బలపరచడం ఇంకా బాక్స్ ఆఫీస్ వసూళ్లను మరింత సురక్షితం చేయడం.
అందుకే OTT platforms హిందీ సినిమాకి ఒక ఫార్ములా, సౌత్ సినిమాలకి ఒక ఫార్ములా ఫాలో అవుతున్నారు.
అందుకే సౌత్ చిత్రాల కోసం నాలుగు వారాల OTT విండోను ఏర్పాటు చేసారు. ఇలా చేయడం వలన, సినిమాకు మరింత తొందరగా డిజిటల్ వసూళ్లు వస్తాయి అనిపించేలా ప్రయత్నం జరిగింది. కానీ ఈ విధానం అంతగా క్లిక్ అవ్వలేదు. ఎందుకంటే ప్రేక్షకులు హిట్ అయ్యే సినిమాలకి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కి ప్రాధాన్యం ఇస్తారు.

సో, పుష్ప 2 ఇంకా కల్కి సినిమాలు అన్ని భాషల్లో ఎనిమిది వారాల theatrical windowని పాటించాయి. అంటే, సినిమా విడుదల అయిన తర్వాత ఎనిమిది వారాలు తరవాత OTT లో స్ట్రీమ్ అయ్యింది.
సో, ఇప్పుడు, జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నా డ్రాగన్ సినిమా కూడా అదే విధానం పాటించాలని అనుకుంటున్నారు. ఈ సినిమా కూడా అన్ని భాషల్లో ఎనిమిది వారాల theatrical windowతో Netflix తో ఒప్పందం చేసుకుంది.

ఈ విధానం రాబోయే సినిమాల కోసం ఒక కొత్త పద్ధతిగా మారుతోంది. మరిన్ని చిత్రాల నిర్మాతలు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తే, థియేట్రికల్ మార్కెట్ బలపడుతుంది, బాక్స్ ఆఫీస్ విజయాలు ఎక్కువగా వస్తాయి, అలాగే ప్రేక్షకుల theatrical ఎక్స్‌పీరియెన్స్ కు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.