ఆల్రెడీ సోషల్ మీడియా ని మిరాయి కలెక్షన్స్ ఊపేస్తున్నాయి… ఇప్పుడు ఇక పవన్ కళ్యాణ్ OG వంతు కదా. ఎలానో సెప్టెంబర్ 25 న థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది. సో, ప్రొమోషన్స్ జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని ఊపేయడానికి ‘GUNS N ROSES’ సాంగ్ రిలీజ్ అయ్యింది…
జస్ట్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో, సోషల్ మీడియా మారుమోగిపోతుంది… ఈ సాంగ్ థమన్ కంపోజిషన్ లో బెస్ట్ వన్ గా మారిపోతుంది… అలాగే మన పవన్ కళ్యాణ్ అదే నండి ఓజాస్ గంభీర హీరో elevation సాంగ్ కాబట్టి ఆ మాత్రం ఉండాలి కదా…
OG సినిమా ని సుజీత్ డైరెక్ట్ చేస్తే, DVV ENTERTAINMENT బ్యానర్ పై నిర్మించబడింది! ఈ సినిమా లో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, శ్రీయ రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్, సౌరవ్, లోకేష్, వెన్నెల కిషోర్, నేహా శెట్టి కూడా నటించారు…