నిన్న మన ఇండియన్ టీం ఆడిన ఆట సూపర్… అద్భుతం అసలా! ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని పాకిస్తాన్ ని బాటింగ్ ఇచ్చాం. ఆమ్మో ఫస్ట్ పాకిస్తాన్ బాటింగ్ చూసి, ఎక్కడ 200 కొట్టేస్తుందో అనిపించింది… కానీ మన బౌలర్లు మంచి కం బ్యాక్ ఇచ్చారు. 114 – 3 నుంచి 146 కి అల్ అవుట్ అయ్యింది…
ఇక మన ఇండియన్ బాటింగ్ వచ్చేసరికి, అభిషేక్, గిల్, సూర్య అవుట్ అయ్యేసరికి టీం స్కోర్ జస్ట్ 20 కానీ మన తిలక్ వర్మ, సంజు, దూబే చక్కగా బాటింగ్ చేసి, మ్యాచ్ ని ముగించారు…
ఆలా మన ఘనంగా 5 వికెట్ ల తేడా తో పాకిస్తాన్ ని ఓడించాం కదా. అలానే ట్రోఫీ తీస్కోకుండా, పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పాము.
ఇక ఈ క్లినికల్ విన్ తరువాత ఆసియ కప్ గెలిచినందుకు పీఎం మోడీ కూడా మన టీం ని అభినందిస్తూ ఒక మంచి ట్వీట్ షేర్ చేసారు…
అలాగే మెగాస్టార్ చిరు కూడా మన టీం ని అభినందించారు…
సూపర్ టీం ఇండియా… ఇలానే పాకిస్తాన్ ని ఎక్కడ ఛాన్స్ దొరికిన ఉతికి పారెయ్యాలి కదా…