మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న సినిమా ‘పెద్ది’ భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్రల్లో పలువురు ప్రముఖ నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ చరణ్, జాన్వీ కపూర్ లను పరిచయం చేసి, “చికిరి చికిరి…” సాంగ్ తో ఒక ఊపు ఊపేసారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి జగపతిబాబు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆయన ‘అప్పలసూరి’ అనే పాత్రలో కనిపించనున్నారు. జగపతిబాబు ఈ పాత్ర కోసం పూర్తిగా డి-గ్లామర్ లుక్ లోకి మారిపోయాడు. మాసిపోయిన కుర్తా, కండువా తో ఆయన లుక్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఇంకా అయన కోపం సినిమా పైన అంచనాలను పెంచేసాయి…
లేటెస్ట్ సమాచారం ప్రకారం, పెద్ది సినిమా మొత్తం టాకీ పార్ట్‌ను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయనుంది. అదే సమయంలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయని, సినిమా టైమ్‌లైన్‌ను చాలా పక్కాగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా బోమన్ ఇరానీ కూడా ఈ స్టార్ కాస్ట్‌లో చేరినట్లు సమాచారం.
ఈ సినిమా అన్ని అనుకున్నారు జరిగితే మార్చ్ 2026 లో రిలీజ్ అవుతుంది!