మన పురాణాల్లో ఎన్ని కథలు ఉన్నాయో మన అందరికి తెలుసు కదా… ఒక్కో కథ ని తీసిన బ్లాక్బస్టర్ గ్యారంటీ… కానీ సరిగ్గా మంచిగా తీయాలి అదే మెయిన్ పాయింట్! ఇక మిరాయి సినిమా ని ఆల్రెడీ చూసాం. ఆ సినిమాలో మంచి పాయింట్ తీస్కుని రాముని బాణం తో లాస్ట్ లో లింక్ చేసిన విధానం చాల బాగుంది… ఈ సినిమాకి ఆల్రెడీ మంచి కలెక్షన్స్ వచ్చాయి…
ఇక నెక్స్ట్ అందరి చూపు సుధీర్ బాబు ‘జటాధరా’ పైనే… ఈ సినిమా లో సోనాక్షి సిన్హా నే మెయిన్ హైలైట్! తాను ధన రాక్షసి లాగ కనిపించబోతోంది!
టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జంటగా వస్తున్న జటాధర సినిమా మీద ఊహాగానాలు మాములుగా లేవు. అసలు ఈ కథ 2018లో కేరళలోని పద్మనాభస్వామి ఆలయ కేసును ఆధారంగా చేసుకుని తీయబడిందా అన్నది అందరి డౌట్.
నిజ జీవితంలో పద్మనాభస్వామి ఆలయం తన మూసివేసిన గదులు, అపారమైన దాచిన సంపద, వాటిని తెరవడానికి ప్రయత్నించిన వారిపై జరిగిన అనర్ధాల వల్లే ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఆరో గది గురించి పిచ్చికథలు, శాపాలు, ప్రకృతి వైపరీత్యాల ఊహలు ఇప్పటికీ భయానక రహస్యంగానే ఉన్నాయి.
అయితే జటాధర నేరుగా బయోపిక్ కాదు. భక్తి, దాచిన ధనంపై లాలస, మంచి-చెడుల మధ్య శాశ్వత పోరాటం అనే అంశాలను కలిపి, ఆ లెజెండ్స్‌కి కొత్త ఆధ్యాత్మిక-మైథలాజికల్ థ్రిల్లర్ రూపమిచ్చారు. వాస్తవం నుండి ప్రేరణ పొందినా, పూర్తిగా ఊహాశక్తి, అతీంద్రియత కలిసిన వేదికను దర్శకులు సృష్టించారు.
ఈ చిత్రాన్ని వేంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తుండగా, జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా కలిసి నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో నవంబర్ 7న విడుదల కానుంది.